AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ultravioletter X-47 బైక్​ డెలివరీలు ప్రారంభం.. ఫీచర్లు, ధర గురించి తెలిస్తే ఫిదా అయిపోతారు

కొత్త ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకునే వారికి X-47 Venom మరో ఆసక్తికరమైన ఎంపికగా మారనుంది. ముఖ్యంగా కొత్త ఎలక్ట్రికల్ ఆర్కిటెక్చర్, అదనపు రేంజ్‌, 7 ఇంచుల TFT డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఇందులో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభించిన కంపెనీ, ఇప్పుడు డెలివరీలను కూడా దశలవారీగా అందిస్తోంది.

Ultravioletter X-47 బైక్​ డెలివరీలు ప్రారంభం.. ఫీచర్లు, ధర గురించి తెలిస్తే ఫిదా అయిపోతారు
Ultraviolette X 47 Venom Electric Motorcycle
Nikhil
|

Updated on: Nov 27, 2026 | 9:48 PM

Share

ఎలక్ట్రిక్ బైక్‌ల మార్కెట్‌లో కొత్త మోడళ్లకు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ సంస్థ Ultraviolette మరో కొత్త బైక్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవల పరిచయం చేసిన X-47 Venom ఎలక్ట్రిక్ బైక్ డెలివరీలను దేశవ్యాప్తంగా ప్రారంభించింది. కొత్త VX-100 హై వోల్టేజ్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందిన ఈ బైక్‌లో గత మోడల్‌తో పోలిస్తే పలు కీలక మార్పులు చేశారు. తక్కువ బరువు, మెరుగైన రేంజ్‌, ఆధునిక ఫీచర్లతో ఈ మోడల్ ఎలక్ట్రిక్ బైక్ ప్రియులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

కొత్త VX-100 ప్లాట్‌ఫామ్

Ultraviolette గత నెల చివర్లో కొత్త VX-100 ప్లాట్‌ఫామ్‌ను పరిచయం చేసింది. ఈ ప్లాట్‌ఫామ్‌పై రూపొందిన తొలి బైక్ X-47 Venom కావడం విశేషం. బైక్‌ను ఆవిష్కరించిన వెంటనే కంపెనీ బుకింగ్స్ ప్రారంభించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 55 Ultraviolette షోరూమ్‌లలో డెలివరీలు మొదలయ్యాయి.

ఈ బైక్‌ను నాలుగు వేరియంట్లలో అందిస్తున్నారు. అయితే అన్ని వేరియంట్ల డెలివరీలు ఒకేసారి ప్రారంభం కాలేదు. కంపెనీ దశలవారీగా వేరియంట్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ముందుగా బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు ప్రాధాన్యత ఆధారంగా డెలివరీలు అందనున్నాయి.

17 కిలోల బరువు తగ్గింపు..

X-47 Venomలో 100V ఎలక్ట్రికల్ ఆర్కిటెక్చర్‌ను ఉపయోగించారు. ఈ కొత్త టెక్నాలజీ కారణంగా గత మోడల్‌తో పోలిస్తే బైక్ బరువు 17 కిలోల వరకు తగ్గింది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే అదనంగా 20 కిలోమీటర్ల వరకు ప్రయాణించే రేంజ్‌ను కూడా అందిస్తోంది. ఫీచర్ల విషయానికి వస్తే 7 ఇంచుల TFT డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్ వంటి సదుపాయాలు ఉన్నాయి.

ధర విషయానికి వస్తే Ultraviolette X-47 Venom ప్రారంభ ధర రూ.2.65 లక్షలుగా ఉంది. టాప్ ఎండ్ Recon+ వేరియంట్ ధర సుమారు రూ.4 లక్షల వరకు ఉంటుంది. అయితే ఈ ప్రారంభ ధరలు మొదటి 5,000 మంది కొనుగోలుదారులకు మాత్రమే వర్తిస్తాయి. ఆ తర్వాత వేరియంట్లను బట్టి ధరలు గరిష్ఠంగా రూ.35,000 వరకు పెరిగే అవకాశం ఉంది. తక్కువ బరువు, అదనపు రేంజ్‌, కొత్త టెక్నాలజీ కోరుకునే ఎలక్ట్రిక్ బైక్ వినియోగదారులకు X-47 Venom ఆకర్షణీయమైన ఎంపికగా నిలవనుంది.

Follow Us