AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్త కారు లాంచ్​ చేసిన Honda.. 500 కి.మీ రేంజ్​ సహా అద్బుత పెర్ఫామెన్స్​తో Alpha EV

New Honda Alpha EV Electric SUV Launch in India on December 2: Interior Design, 75kWh Battery, 500km Range, Expected Price and Features ప్రముఖ కార్ల తయారీ సంస్థ Honda భారత మార్కెట్‌లోకి తన తొలి ఎలక్ట్రిక్ SUVని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. Honda Alpha పేరుతో రానున్న ఈ మిడ్‌సైజ్ ఎలక్ట్రిక్ SUVని డిసెంబర్ 2న విడుదల చేయనుంది. తాజాగా కంపెనీ ఈ కారు ఇంటీరియర్ డిజైన్ స్కెచ్‌ను వెల్లడించింది. ఇప్పటివరకు బయటకు రాని క్యాబిన్ వివరాలు ఆసక్తిని పెంచుతున్నాయి. ఆధునిక డిజైన్, అధునాతన ఫీచర్లతో ఈ కొత్త SUVని రూపొందించినట్లు స్కెచ్ ద్వారా తెలుస్తోంది.

కొత్త కారు లాంచ్​ చేసిన Honda.. 500 కి.మీ రేంజ్​ సహా అద్బుత పెర్ఫామెన్స్​తో Alpha EV
Honda Alpha Ev Electric Suv
Nikhil
|

Updated on: Nov 27, 2026 | 9:51 PM

Share

పెట్రోల్, డీజిల్ కార్లకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ SUVలను ఎంచుకునే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో Honda కొత్త మోడల్‌పై అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా 400 నుంచి 500 కిలోమీటర్ల వరకు రేంజ్ అందించే అవకాశం, ఆకర్షణీయమైన ఎక్స్‌టీరియర్ డిజైన్, డిజిటల్ ఫీచర్లు ఈ కారుపై ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే బ్యాటరీ సామర్థ్యం, అధికారిక రేంజ్, పూర్తి ఫీచర్ల వివరాలను కంపెనీ లాంచ్ సమయంలో వెల్లడించే అవకాశం ఉంది.

ఆకట్టుకునే ఇంటీరియర్

Honda విడుదల చేసిన ఇంటీరియర్ స్కెచ్ ప్రకారం Alpha EV క్యాబిన్‌లో బ్లాక్, ఆఫ్ వైట్ కలర్ థీమ్ కనిపిస్తోంది. డ్యాష్‌బోర్డ్‌పై యాంబియంట్ లైటింగ్, కొత్త డిజైన్‌తో కూడిన త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్‌తో పాటు డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేను అందించనున్నారు. ఫిజికల్ బటన్లు, టోగుల్ స్విచ్‌లతో ఏసీ కంట్రోల్స్ ఏర్పాటు చేశారు. సెంటర్ కన్సోల్‌లో USB ఛార్జింగ్ పోర్టులు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ సదుపాయం ఉండే అవకాశం ఉంది. వెనుక ప్రయాణికుల కోసం రెండు కప్‌హోల్డర్లతో కూడిన సెంటర్ ఆర్మ్‌రెస్ట్‌ను కూడా అందించనున్నారు.

ఎక్స్‌టీరియర్ విషయానికి వస్తే కనెక్ట్ అయినట్లుగా కనిపించే LED DRLలు, సన్నని LED హెడ్‌ల్యాంప్స్, ప్రకాశించే Honda లోగోతో ప్రత్యేకమైన ఫ్రంట్ డిజైన్‌ను రూపొందించారు. ఫ్లష్ టైప్ డోర్ హ్యాండిల్స్, డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, వీల్ ఆర్చ్‌ల చుట్టూ బ్లాక్ క్లాడింగ్ SUVకి ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తాయి.

75kWh బ్యాటరీ..

Honda Alpha EV పవర్‌ట్రెయిన్ వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఇందులో 65kWh నుంచి 75kWh సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాక్ ఉండవచ్చని అంచనా. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే సుమారు 400 నుంచి 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంది. అధికారిక రేంజ్ వివరాలు లాంచ్ సమయంలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

ధర విషయానికి వస్తే ఈ ఎలక్ట్రిక్ SUV భారత మార్కెట్లో రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల మధ్య ఉండవచ్చని సమాచారం. రాజస్థాన్‌లోని తపుకారా ప్లాంట్‌లో ఈ కారును తయారు చేయనున్నారు. మార్కెట్లోకి వచ్చిన తర్వాత Mahindra BE 6, Tata Sierra EV, Hyundai Creta Electric, Maruti e Vitara వంటి మోడళ్లకు పోటీ ఇవ్వనుంది.

Follow Us