AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండియన్ మార్కెట్​లోకి కొత్త కార్ల కంపెనీ.. లోగో విడుదలతోనే అందరి దృష్టి ఆకర్షించేసింది

భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి మరో కొత్త కార్ల తయారీ సంస్థ అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. JSW Motors పేరుతో కొత్త కార్ల బ్రాండ్‌ను ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇందులో భాగంగా తాజాగా తన కొత్త బ్రాండ్ లోగోను అధికారికంగా ఆవిష్కరించింది. డిసెంబర్ 3, 2026న తొలి మోడల్‌ను పరిచయం చేయనున్న నేపథ్యంలో ఈ లోగోను విడుదల చేసింది. JSW Motors నుంచి మార్కెట్లోకి రానున్న మొదటి కారు Combat SUV కావడంతో ఇప్పటికే ఆటోమొబైల్ రంగంలో ఆసక్తి నెలకొంది.

ఇండియన్ మార్కెట్​లోకి కొత్త కార్ల కంపెనీ.. లోగో విడుదలతోనే అందరి దృష్టి ఆకర్షించేసింది
Jsw Motors Unveils New Brand Logo
Nikhil
|

Updated on: Nov 27, 2026 | 9:54 PM

Share

కొత్త కార్ల బ్రాండ్‌గా JSW Motors ఎలాంటి వాహనాలను తీసుకొస్తుందనే అంశంపై వినియోగదారుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా తొలి SUVలో ప్లగ్-ఇన్ హైబ్రిడ్ టెక్నాలజీ, శక్తివంతమైన ఇంజిన్, ఎలక్ట్రిక్ మోడ్‌లో ప్రయాణించే సదుపాయం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కంపెనీ తన బ్రాండ్ గుర్తింపును పరిచయం చేయడంతో పాటు, తొలి SUV ఆవిష్కరణకు ఏర్పాట్లు చేస్తోంది.

రెక్కల డిజైన్‌తో కొత్త లోగో..

JSW Motors కొత్త లోగోలో కంపెనీ ప్రధాన గ్రూప్ లోగోలో కనిపించే రెక్కల తరహా డిజైన్‌ను ఉపయోగించారు. అయితే దీనికి కొన్ని మార్పులు చేశారు. రెక్కల ఆకృతిని పైకి వాలినట్లుగా రూపొందించి, మధ్యలో ప్రత్యేకమైన కట్ ఇచ్చారు. ఈ డిజైన్ మొత్తాన్ని ఒక సర్కిల్‌లో అమర్చారు. గత వారం లీకైన JSW Combat SUV స్పేర్ వీల్ కవర్‌పైనా ఇదే లోగో కనిపించింది. JSW Motors పేరును రాసిన ఫాంట్ కూడా గ్రూప్ లోగోలోని అక్షరాల కంటే భిన్నంగా ఉంది.

డిసెంబర్ 3న కంపెనీ తన కొత్త బ్రాండ్‌తో పాటు తొలి SUV అయిన Combatను కూడా పరిచయం చేయనుంది. నవంబర్ 16న ప్రారంభమైన అధికారిక వెబ్‌సైట్‌లో కస్టమర్లు తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. మరోవైపు, Automotive Research Association of India (ARAI)తో JSW Motors ఒప్పందం కుదుర్చుకుంది. కొత్త ఫ్యూయల్ వాహనాల అభివృద్ధి, టెస్టింగ్, సేఫ్టీ, బ్యాటరీ టెక్నాలజీ, ADAS, సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాల్లో రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి.

360hp పవర్..

JSW Combat SUV అంతర్జాతీయ మార్కెట్లోని Jetour T2 ఆధారంగా రూపొందుతోంది. ఇందులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, 18.4kWh బ్యాటరీ ప్యాక్ ఉండనున్నాయి. ఈ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ మొత్తం 360hp పవర్, 610Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 3-స్పీడ్ డెడికేటెడ్ హైబ్రిడ్ ట్రాన్స్‌మిషన్ ద్వారా ముందు చక్రాలకు పవర్ అందుతుంది.

ఈ SUV ఎలక్ట్రిక్ మోడ్‌లో ఒక్కసారి ఛార్జింగ్‌తో 90 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని సమాచారం. పెట్రోల్, ఎలక్ట్రిక్ పవర్ కలిపి మొత్తం 1,200 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంది. ధర విషయానికి వస్తే JSW Combat SUV సుమారు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా. అయితే అధికారిక ధరలను డిసెంబర్ 3న వెల్లడించనున్నారు. కొత్త బ్రాండ్‌గా JSW Motors భారత మార్కెట్లో ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి.

Follow Us