AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం సూపర్ న్యూస్.. వారందరికీ ఫ్లాట్ల కేటాయింపు.. పండుగే..

ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది, హైదరాబాద్ వాసులకు సూపర్ న్యూస్ అందించింది. నగరంలో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఈ మేరకు గత కొద్ది రోజుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. దీంతో అర్హులైనవారు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మరో అప్డేట్ వచ్చింది.

Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం సూపర్ న్యూస్.. వారందరికీ ఫ్లాట్ల కేటాయింపు.. పండుగే..
Indiramma Housing
Venkatrao Lella
|

Updated on: Jul 25, 2026 | 7:40 AM

Share

హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం మరో అప్డేట్ ఇచ్చింది. ఇప్పటికే ఇళ్ల మంజూరు కోసం దరఖాస్తులను స్వీకరిస్తోండగా.. ఆగస్ట్ వరకు సమయం ఇచ్చింది. నియోజకవర్గం పరిధిలోని మీ సేవా కేంద్రాలు, మీ సేవా వాట్సప్ సేవల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజులను కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అప్లికేషన్ ఫీజు రూ.100గా ఉండగా.. రూ.10 వేలు రీఫండబుల్ డిపాజిట్ చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో రేవంత్ సర్కార్ మరో అప్డేట్ ఇచ్చింది. తొలి దశలో 17 నియోజకవర్గాల్లో 7,680 ఇందిరమ్మ ఫ్లాట్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో ఫ్లాంట్ 528 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. అలాగే కార్పెట్ ఏరియా 400 చదరపు అడుగులు ఉండనుంది. ప్రభుత్వ భూముల్లోనే ఈ ఇళ్లను నిర్మించి లబ్దిదారులకు అందించనున్నారు. పేదలు ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇళ్ల సమీపంలోనే వీటిని నిర్మించి అందించనున్నారు.

అయితే ఒక్కో ఫ్లాట్ నిర్మాణానికి రూ.11 లక్షల ఖర్చు అవుతుందని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ అందించనుండగా. మిగతా రూ.6 లక్షలు లబ్దిదారుడు భరించాల్సి ఉంటుంది. ఖైరతాబాద్, నాంపల్లి, అంబర్ పేట్, కూకట్ పల్లి. మేడ్చల్, సనత్ నగర్, సికింద్రాబాద్, మలక్ పేట్, రాజేంద్ర నగర్, మహేశ్వరం, శేరలింగంపల్లి, మల్కాజ్ గిరి, ఇబ్రహీంపట్నం వంటి ఏరియాల్లో ఉన్న నిరుపయోగ ప్రభుత్వ భూములను గుర్తించి ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అయితే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్‌లో వివరాలు వెల్లడించారు.

“ప్రతీ కుటుంబం ఆత్మ గౌర‌వంతో బ‌త‌కాల‌నేది మా ల‌క్ష్యం. సొంత ఇల్లు ప్రతీ ఒక్కరి క‌ల‌. పెరిగిన ధ‌ర‌ల‌తో సొంత ఇల్లు క‌ట్టుకోవ‌డం పేద‌ల‌కు భారంగా మారింది. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలో పేద‌ల‌కు ఇండ్లు క‌ట్టించాల‌ని నిర్ణయించాం. ప‌థ‌కం పురోగ‌తిపై స‌మీక్ష నిర్వహించా. ఇందిర‌మ్మ ఇండ్ల ప‌థ‌కం కింద 528 చదరపు అడుగుల విస్తీర్ణంతో 400 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో ఫ్లాట్లు నిర్మించ‌నున్నాం. ఇంటి నిర్మాణానికి అయ్యే రూ. 11 లక్షల ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు సబ్సిడీగా అందిస్తుంది. మిగిలిన రూ.6 లక్షలు లబ్ధిదారుని వాటా. తొలి ద‌శ‌లో 17 నియోజ‌క‌వర్గాల ప‌రిధిలో 7,680 ఫ్లాట్లు నిర్మించి ఇస్తాం. హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలో గ‌జం రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు ప‌లుకుతోంది. గ‌త ప్రభుత్వాలు న‌గ‌రానికి దూరంగా ఇళ్లు నిర్మించ‌డంతో ఎవ‌రూ అక్కడికి వెళ్లలేని ప‌రిస్థితి. ఆయా కుటుంబాలు నివ‌సించే ప్రాంతాలకు స‌మీపంలోనే ఇండ్లు నిర్మించి ఇవ్వాల‌ని మేం నిర్ణయించాం. ఈ క్రమంలో రూ.వంద‌ల కోట్ల విలువైన భూమిని ప్రభుత్వం ఉచితంగా కేటాయిస్తోంది. జ‌నావాసాల మ‌ధ్య నిర్మించే ఈ ఇళ్లల్లో పేద‌ల‌కు విలువైన సొంత ఇల్లు అతి త‌క్కువ వ్యయంతో అభ్యమవడంతో పాటు స్థానికంగానే ఉపాధి ల‌భిస్తుంది” అని రేవంత్ ఎక్స్‌లో పేర్కొన్నారు.

Follow Us
ఐసీయూలో సీనియర్ నటి షావుకారు జానకి..
ఐసీయూలో సీనియర్ నటి షావుకారు జానకి..
'కోచింగ్ లేకుండా సివిల్స్ సాధ్యమే.. ఈ బుక్స్ చదవండి' UPSC టాపర్
'కోచింగ్ లేకుండా సివిల్స్ సాధ్యమే.. ఈ బుక్స్ చదవండి' UPSC టాపర్
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర