AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. ఐఎమ్‌డీబీలో 9.3 రేటింగ్ మూవీ..

గత నెలలోనే థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. అలాగే ఐఎమ్ డీబీలో ఏకంగా 9.3 రేటింగ్ సొంతం చేసుకుంది. ఇప్పుడీ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ సడెన్ గా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. ఐఎమ్‌డీబీలో 9.3 రేటింగ్ మూవీ..
OTT Movie
Basha Shek
|

Updated on: Feb 07, 2026 | 9:47 PM

Share

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలో పలు ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చాయి. సంక్రాంతికి థియేటర్లలో రిలీజైన సినిమాలతో పాటు వివిధ భాషల్లో తెరకెక్కిన డబ్బింగ్ సినిమాలు కూడా స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. ఓవరాల్ గా 15కు పైగా కొత్త సినిమాలు ఇప్పుడు ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. అయితే ఇందులో ఒక తెలుగు సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. గత నెలలో థియేటర్ల లో విడుదలైన ఈ సినిమా బాగానే ఆడింది. అయితే ప్రమోషన్లు చేయకపోవడంతో లాంగ్ రన్ కొనసాగించలేకపోయింది. కానీ ఐఎమ్ డీబీలో ఈ మూవీకి ఏకంగా 9.3 రేటింగ్ ఉండడం విశేషం. ఈ సినిమా కథ కూడా చాలా ఇంట్రెస్ట్రింగ్ గా ఉంటుంది. ఇందులో హీరో గొప్ప క‌బ‌డ్డీ ప్లేయ‌ర్‌గా పేరు తెచ్చుకోవాల‌ని క‌ల‌లు కంటాడు. అయితే ఒక తప్పు కారణంగా ప‌దిహేనేళ్ల పాటు ఊరి దాటి వెళ్ల‌కూడ‌ద‌ని ఊరి పెద్ద శిక్ష విధిస్తాడు. ఈ తీర్పు కార‌ణంగా హీరో ఉన్న‌త చ‌దువుల‌కు దూరమవుతాడు. ఊరి దాటి మండ‌ల‌స్థాయి కబడ్డీ పోటీల్లో కూడా పాల్గొన‌లేక‌పోతాడు. అదే సమయంలో ఊరి స‌ర్పంచ్ కూతురు సీత‌తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. త‌న ప్రేమ‌ను గెలిపించుకోవ‌డం కోసం స‌ర్పంచ్ ఎలెక్ష‌న్స్‌లో పోటీ కూడా చేస్తాడు. మరి దొంగ‌గా ముద్ర‌ప‌డిన హీరో సర్పంచ్ ఎన్నిక‌ల్లో గెలిచాడా? సీత‌ను పెళ్లిచేసుకున్నాడా? గొప్ప కబడ్డీ ప్లేయర్ అయ్యాడా? లేదా? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా మూవీ పేరు నీలకంఠ. దేవి, సింహరాశి తదతర సినిమాల్లో నటించిన ఛైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ మహేంద్రన్ ఈ మూవీలో హీరోగా నటించాడు. రాకేష్ మాధవన్ తెరకెక్కించిన ఈ మూవీలో యష్ణ ముతులూరి హీరోయిన్‌గా చేసింది. అలాగే రాంకీ, బబ్లూ పృథ్వీ, శుభలేఖ సుధాకర్, చిత్రం శీను, సత్య ప్రకాష్, భరత్ రెడ్డి తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. గతంలో పలు తెలుగు సినిమాల్లో నటించి మెప్పించిన స్నేహా ఉల్లాల్ ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ లో మెరవడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం భాషల్లోనూ ఈ క్రైమ్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది.

సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us