Ram Charan : మరోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్.. ఉపాసన సీమంతం వేడుక.. వీడియో..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల గుడ్ న్యూస్ పంచుకున్నారు. చిరు ఇంట్లో దీపావళి సెలబ్రేషన్లతోపాటు ఉపాసన సీమంతం వేడుక నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఉపాసన. అలాగే తన ఇంట్లో డబుల్ సెలబ్రేషన్స్ అంటూ క్యాప్షన్ పెట్టారు. దీంతో రామ్ చరణ్, ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి తండ్రి కాబోతున్నారు. మెగాస్టార్ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ తోపాటు ఉపాసన సీమంతం వేడుకను నిర్వహించారు. ఈ వీడియోను ఉపాసన షేర్ చేస్తూ డబుల్ ప్రేమ, డబుల్ బ్లెస్సింగ్స్, డబుల్ సెలబ్రేషన్స్ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ జంటకు 2023 జూన్ లో క్లీంకార జన్మించగా రెండేళ్ల తర్వాత మరోసారి పేరెంట్స్ కాబోతున్నారు. ‘సింబా’ వస్తున్నాడంటూ మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కొన్ని రోజులుగా రామ్ చరణ్, ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒక్క వీడియోతో రూమర్స్ కు బ్రేక్ చేశారు ఉపాసన. తాజాగా షేర్ చేసిన వీడియోలో కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ ఉపాసనను ఆశీర్వదిస్తూ కనిపించారు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం ఈ మూవీ విడుదలైన గ్లింప్స్ మూవీపై హైప్ క్రియేట్ చేశాయి. ఇందులో చరణ్ పక్కా ఊర మాస్ లుక్ లో కనిపించనున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా రాబోతున్న పెద్ది సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.




