Fauzi Movie: ప్రభాస్ – హను రాఘవపూడి టైటిల్ ఇదే.. డార్లింగ్ పోస్టర్ అదిరిపోయిందిగా..
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్న డార్లింగ్.. మరోవైపు డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో కొత్త ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా డార్లింగ్ బర్త్ డే సందర్బంగా ఈ సినిమా నుంచి టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పుడు విడుదలైన పోస్టర్ అదిరిపోయింది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు నేడు (అక్టోబర్ 23). ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్, సినీప్రముఖులు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. మరోవైపు డార్లింగ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి వచ్చే అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్స్ నుంచి పోస్టర్స్ విడుదలవుతున్నాయి. ముఖ్యంగా హను, ప్రభాస్ కాంబో పై క్లారిటీ వచ్చేసింది. సితారామం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ హను రాఘవపూడి .. ఇప్పుడు ప్రభాస్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాగా.. ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అయితే కొన్నాళ్లుగా ఈ మూవీ టైటిల్ గురించి ఫిల్మ్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. తాజాగా ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఇవి కూడా చదవండి : Actress: ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలి బ్రహ్మాకుమారిగా.. 45 ఏళ్ల వయసులో ఇలా.. గుర్తుపట్టారా.. ?
కాసేపటి క్రితం ఈ సినిమా టైటిల్ పోస్టర్ చేశారు. ముందు నుంచి వినిపిస్తున్నట్లుగానే ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అలాగే తాజాగా విడుదలైన పోస్టర్ సైతం అదిరిపోయింది. “పద్మవ్యూహాన్ని జయించిన పార్థుడు.. పాండవ పక్షంలో నిలిచిన కర్ణుడు.. గురువు లేకుండానే యుద్ధ కళలో నిపుణుడైన ఏకలవ్యుడు, జన్మతః యోధుడు ఇతనే “ అంటూ ఎలివేషన్ ఇస్తూనే మన చరిత్రలోని దాగిన అధ్యాయాల నుంచి ఒక యోధుడి అత్యంత ధైర్యవంతమైన కథ అన్న క్యాప్షన్ తో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేశారు.
ఇవి కూడా చదవండి : Actress : శ్రీదేవికి వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరోయిన్.. ఒకప్పుడు డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్.. చివరకు ఊహించని విధంగా..
पद्मव्यूह विजयी पार्थःपाण्डवपक्षे संस्थित कर्णः।गुरुविरहितः एकलव्यःजन्मनैव च योद्धा एषः॥#PrabhasHanu is #FAUZI ❤🔥
The bravest tale of a soldier from the hidden chapters of our history 🔥
Happy Birthday, Rebel Star #Prabhas ❤️#HappyBirthdayFAUZI#HappyBirthdayPRABHAS… pic.twitter.com/R7hjLRSFfF
— Mythri Movie Makers (@MythriOfficial) October 23, 2025
ఇవి కూడా చదవండి : Cinema : ఇవేం ట్విస్టులు రా అయ్యా.. ఊహించని మలుపులు.. ఈ సినిమాను అస్సలు మిస్సవ్వద్దు..
తాజాగా విడుదలైన పోస్టర్ తో ఈ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు మొదలయ్యాయి. ఇదివరకు సీతారామం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హను.. ఇప్పుడు ప్రభాస్ తో చేయబోయే సినిమా ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీ నెలకొంది. తాజాగా విడుదలైన పోస్టర్ లోని పదాలు చూస్తుంటే… ఇందులో ప్రభాస్ పాత్ర ఎలా ఉండనుందనేది అర్థమవుతుంది.
ఇవి కూడా చదవండి : Actress : నాగార్జున, రజినీకాంత్‌తో సినిమాలు.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. ఈ చిన్నారి నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా..?
