Tollywood : ప్రభాస్, రవితేజతో బ్లాక్ బస్టర్ హిట్స్ చేసింది.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఇలా.. ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా.. ?
తెలుగు సినిమా ప్రపంచంలో ఒకటి రెండు చిత్రాలతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న తారలు చాలా మంది ఉన్నారు. తక్కువ సమయంలోనే తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని.. ఆ తర్వాత అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ సైతం ఆ జాబితాలోకి చెందినవారే. ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ?

పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? ఒకప్పుడు తెలుగులో క్రేజీ బ్యూటీ. తక్కువ సినిమాలే చేసినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో అందం, అభినయంతో చక్రం తిప్పిన తారలలో ఆమె ఒకరు. అనుష్క శెట్టి, కాజల్ అగర్వాల్ వంటి స్టార్ హీరోయిన్లకు పోటీ ఇచ్చింది. ఒకటి రెండు సినిమాలతో కుర్రాళ్ల ఆరాధ్య దేవతగా మారిపోయిన ఈ అమ్మడు..ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఇప్పుడు తన భర్త, తనయుడితో కలిసి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ? తెలుగులో ప్రభాస్, రవితేజ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. ఆమె మరెవరో కాదండి.. మిర్చి మూవీ హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ. తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని హీరోయిన్. ప్రభాస్, అనుష్క శెట్టి కలిసి నటించిన మిర్చి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది.
ఇవి కూడా చదవండి : Actress : శ్రీదేవికి వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరోయిన్.. ఒకప్పుడు డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్.. చివరకు ఊహించని విధంగా..
2013లో డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన మిర్చి సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దేవి ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని పాటలు అభిమానులను విపరీతకంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాతో తెలుగులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. మిర్చి తర్వాత తెలుగులో ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. రిచా గంగోపాధ్యాయ.. రానా దగ్గుబాటి నటించిన లీడర్ సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. మొదటి సినిమాతోనే నటిగా ప్రసంసలు అందుకుంది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించింది.
ఇవి కూడా చదవండి : Cinema : ఇవేం ట్విస్టులు రా అయ్యా.. ఊహించని మలుపులు.. ఈ సినిమాను అస్సలు మిస్సవ్వద్దు..
మాస్ మహారాజా రవితేజ జోడిగా మిరపకాయ్ సినిమాలో నటించింది. మిర్చి, మిరపకాయ్ చిత్రాలతో తెలుగులో క్రేజ్ వచ్చేసింది. నాగవల్లి, సారొచ్చారు వంటి చిత్రాల్లో నటించింది. అదే సమయంలో అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యింది. తన స్నేహితుడు జో లాంగెల్లాను 2019లో పెళ్లి చేసుకున్న రిచా.. ఆ తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యింది. ఈ దంపతులకు 2021లో బాబు జన్మించాడు. ప్రస్తుతం తన కొడుకు, భర్తతో కలిసి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలో తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. ఒకప్పుడు సన్నజాజిలా ఉండే రిచా.. ఇప్పుడు కాస్త బొద్దుగా మారిపోయింది. తాజాగా ఆమె లుక్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.
ఇవి కూడా చదవండి : Actress : నాగార్జున, రజినీకాంత్‌తో సినిమాలు.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. ఈ చిన్నారి నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా..?
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Actress: ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలి బ్రహ్మాకుమారిగా.. 45 ఏళ్ల వయసులో ఇలా.. గుర్తుపట్టారా.. ?




