AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ డైరెక్టర్ ఇంటి గేటు దగ్గర ఛాన్స్‌లు కోసం నేను, చిరంజీవి వెయిట్ చేశాం.. ఓపెన్‌గా చెప్పిన టాలీవుడ్ హీరో

నటుడు భానుచందర్ తన అరంగేట్రం, చిరంజీవితో ఉన్న ఫ్రెండ్షిప్, ప్రముఖ దర్శకుడు బాల మహేంద్రతో తన సినిమా గురించి కీలక విషయాలు పంచుకున్నాడు. నిరీక్షణ చిత్రం తన కెరీర్‌లో ఎలా కీలకంగా మారిందో వివరించాడు. ఆ వివరాలు ఇలా ఈ స్టోరీలో తెలుసుకోండి.

ఆ డైరెక్టర్ ఇంటి గేటు దగ్గర ఛాన్స్‌లు కోసం నేను, చిరంజీవి వెయిట్ చేశాం.. ఓపెన్‌గా చెప్పిన టాలీవుడ్ హీరో
Chiranjeevi Bhanu Chandar
Ravi Kiran
|

Updated on: Jan 16, 2026 | 1:50 PM

Share

ప్రముఖ నటుడు భానుచందర్ తన సినీ అరంగేట్రం, కెరీర్ తొలినాళ్ళలో ఎదుర్కున్న ఇబ్బందులు, చిరంజీవితో ఫ్రెండ్షిప్ లాంటి విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. ముంబై నుంచి వచ్చి, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న తర్వాతే భానుచందర్ సినిమాల్లోకి అరంగేట్రం చేశాడు. 1978లో మన ఊరి పాండవులు కంటే ముందు నాలాగే ఎందరో తన తొలి చిత్రమని తెలిపాడు. ఈ చిత్రానికి ఏ. రాంకీ శర్మ దర్శకత్వం వహించగా, బాలచందర్ అసోసియేట్‌గా పనిచేశాడు.

ఇది చదవండి: ‘ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా తీశాడు..’

తన తండ్రి ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ, తనకోసం ఎలాంటి సిఫార్సు చేయలేదని భానుచందర్ తెలిపాడు. దర్శకుడు బాలచందర్ ఇంటికి వెళ్ళినప్పటికీ, ఆయన లేకపోవడంతో నిరాశగా వెనుదిరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయన్నాడు. ఆ తర్వాత ఇన్‌స్టిట్యూట్‌లో చేరిన భానుచందర్, చిరంజీవి, సుధాకర్, హరిప్రసాద్ లాంటివారితో కలిసి బాలచందర్ ఆఫీస్ గేటు దగ్గర అవకాశాల కోసం వెయిట్ చేసిన రోజులను గుర్తు చేసుకున్నాడు. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో కృష్ణంరాజుతో పాటు సెకండ్ హీరోగా నటించాను. మన ఊరి పాండవులులో మురళీమోహన్, చిరంజీవి, ప్రసాద్ బాబు, జై భాస్కర్‌లతో కలిసి నటించాను. దురదృష్టవశాత్తూ సహనటి శోభ 1980 లోనే ఆత్మహత్య చేసుకుందని భానుచందర్ బాధపడ్డాడు.

ఇవి కూడా చదవండి

ప్రముఖ దర్శకుడు బాల మహేంద్రతో భానుచందర్ రిలేషన్ దోసకాయలపల్లిలో మొదలైంది. షూటింగ్ జరుగుతుండగా వర్షం రావడంతో అందరూ లోపలికి వెళ్లినప్పుడు, బాపు తన కరాటే విన్యాసాలు చూపించమని భానుచందర్‌ను అడిగారట. అప్పుడు చిరంజీవితో కలిసి స్లో మోషన్‌లో కరాటే చేసి చూపించాడు. అది నచ్చి బాల మహేంద్ర, ప్రతాప్ పోతన్ దర్శకత్వంలో తీస్తున్న చిత్రంలో ఒక చిన్న పాత్రను భానుచందర్‌కు ఇచ్చారట. నీంగల్ కేటది అనే చిత్రం బాల మహేంద్ర కెరీర్‌లో అతిపెద్ద హిట్ అయిందని భానుచందర్ అన్నాడు.

ఆ తర్వాత నిరీక్షణ చిత్రం భానుచందర్ కెరీర్‌ను కీలక మలుపు తిప్పింది. తెలుగులో ఇప్పటివరకు నిరీక్షణ లాంటి ప్రేమకథ రాలేదని, అది కేవలం భానుచందర్, అర్చనల కథ కాదని, ఒక అటవీ అధికారి, గిరిజన యువతి విధి అని భానుచందర్ పేర్కొన్నాడు. నిరీక్షణ చిత్రంలో ఒక సన్నివేశంలో అటవీ అధికారి పాత్రలో జైలులో ఉండగా, ఇన్నర్స్ కూడా తీసేయమని బాల మహేంద్ర అన్నారు. పాత్ర పట్ల నిబద్ధతతో భానుచందర్.. డ్రెస్ ఏమి లేకుండా చేశాడట. ఈ సన్నివేశం చూసి బాల మహేంద్ర భావోద్వేగానికి లోనయి, భానుచందర్ నిబద్ధతను ప్రశంసించారట. అలాగే అర్చన కూడా గిరిజన యువతి పాత్రలో బ్లౌజ్ లేకుండా కేవలం చీరతో సహజంగా నటించారని, దానిలో ఎలాంటి అశ్లీలత లేదని, గిరిజన మహిళలు అలానే ఉంటారని బాల మహేంద్ర గొప్పగా చిత్రీకరించారని భానుచందర్ వివరించాడు.

ఇది చదవండి: సామాన్య వ్యక్తిని కూడా కోటీశ్వరుడిని చేయొచ్చు..! ఇది తెలిస్తే శాలరీ లేకపోయినా హ్యాపీగా బ్రతికేయొచ్చు

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..