AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ జైలర్ కొడుకు ఇప్పుడు స్టార్ హీరో.. పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్.. ఎవరో గుర్తు పట్టారా?

సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయం కృషితో స్టార్ గా ఎదిగిన హీరోల్లో ఇతను కూడా ఒకడు. కెరీర్ ప్రారంభంలో స్టార్ హీరోల సినిమాల్లో సైడ్ యాక్టర్ గా చేసిన ఇతను ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు.

Tollywood: ఈ జైలర్ కొడుకు ఇప్పుడు స్టార్ హీరో.. పాన్ ఇండియా  రేంజ్ లో క్రేజ్.. ఎవరో గుర్తు పట్టారా?
Sivakarthikeyan
Basha Shek
|

Updated on: Jan 16, 2026 | 1:16 PM

Share

పై ఫొటోలో సర్కిల్ ఉన్న కుమారుడిని గుర్తు పట్టారా? ఈ పిల్లాడు ఇప్పుడు పాన్ ఇండియా హీరో. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా, గాడ్ ఫాదర్ అండ లేకుండా స్వయం కృషితో స్టార్ హీరోగా ఎదిగిన వాళ్లలో ఈ నటుడు ఒకడు. అందుకే ఈ హీరోకు కోట్లాది మంది అభిమానులున్నారు. చాలా మంది లాగే ఇతను కూడా ఒక సాధారణ కుటుంబంలోనే పుట్టాడు. తండ్రి జైలు సూపరింటెండెంట్.. అక్కేమో డాక్టర్.. ఇతను కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఎంబీఏ లాంటి పెద్ద చదువులే చదివాడు. అయితే సాఫ్ట్ వేర్ లాంటి ఉద్యోగాలకు వెళ్లకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మొదట బుల్లితెరపై యాంకర్ గా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత వెండితెరపై సైడ్ యాక్టర్ గా చేశాడు. స్టార్ హీరోల సినిమాల్లో సహాయక నటుడిగా మెప్పించారు. తనదైన నటనతో ప్రేక్షకులను అలరించాడు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఇప్పుడు పాన్ ఇండియా హీరో రేంజ్ కు ఎదిగిపోయాడు. ఇంతకీ అతనెవరనుకుంటున్నారు?

ఇవి కూడా చదవండి

ఈ సంక్రాంతికి పరాశక్తి సినిమాతో ఆడియెన్స్ ను పలకరించాడు కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్. జనవరి 10న విడుదలైన ఈ సినిమా మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఇందులో శివ కార్తికేయన్ నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కాగా గత కొన్నేళ్లుగా వరుసగా విజయాలు అందుకుంటున్నాడు శివ కార్తికేయన్. మహావీరుడు, అలయాన్, అమరన్, మదరాసి.. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో కోలీవుడ్ లో స్టార్ హీరో రేంజ్ కు ఎదిగిపోయాడు కార్తికేయన్. అయితే భారీ అంచనాలతో రిలీజైన పరాశక్తి సినిమా మాత్రం నెగెటివ్ టాక్ తో నడుస్తోంది. సుధా కొంగర తెరకెక్కించిన ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. జయం రవి, అధర్వ మురళి కీలక పాత్రలు పోషించారు.

సంక్రాంతి సంబరాల్లో శివ కార్తికేయన్ ఫ్యామిలీ..

పరాశక్తి సినిమాలో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..