AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajamouli: సినిమా బ్లాక్‌బస్టర్.. కానీ.! వీడు హీరోగా దొరికాడేంటి అనుకున్నా..

దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తన తొలి చిత్రం స్టూడెంట్ నెం.1 మూవీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆర్ఆర్ఆర్ తనకు ఇష్టమైన చిత్రమని పేర్కొన్నాడు. అలాగే ఎన్టీఆర్, సావిత్రి లాంటి దివంగత నటులతో పనిచేయాలనే తన కోరికను కూడా తెలిపాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి ఈ స్టోరీ చూసేయండి.

Rajamouli: సినిమా బ్లాక్‌బస్టర్.. కానీ.! వీడు హీరోగా దొరికాడేంటి అనుకున్నా..
Rajamouli Telugu Cinema
Ravi Kiran
|

Updated on: Jan 14, 2026 | 10:01 AM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్ఎస్. రాజమౌళి. బాహుబలి 1 & 2, ఆర్ఆర్ఆర్ సినిమాలతో పాన్ వరల్డ్ స్థాయిలో తెలుగు చిత్రపరిశ్రమను నిలబెట్టిన రాజమౌళి.. ప్రస్తుతం మహేష్ బాబుతో కలిసి ‘వారాణసి’ సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. రాజమౌళి గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశాడు. తన తొలి చిత్రం స్టూడెంట్ నెం.1 ప్రజల మైండ్ నుంచి తీయాలనుకుంటున్నట్టు రాజమౌళి అన్నాడు. ఆ సినిమా చూసినప్పుడల్లా క్రింజ్, ఇమ్‌ మెచ్యూర్‌గా ఉంటుందని తెలిపాడు. తన కెరీర్ తొలినాళ్లలో ఆ సినిమా చేసినప్పటికీ.. దానిపై తాను అసంతృప్తితో ఉన్నట్టు స్పష్టం చేశాడు. అలాగే తనకు ఇష్టమైన సినిమా ఆర్ఆర్ఆర్ అని తెలిపాడు.

ఇది చదవండి: ‘ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా తీశాడు..’

దివంగత నటులైన ఎన్టీఆర్, సావిత్రితో కలిసి పనిచేయాలన్నది తన కోరిక అని.. వారిద్దరూ ఇప్పుడు జీవించి ఉంటే వారితో కలిసి పని చేయడానికి ఇష్టపడతానని తెలిపాడు. ఆ ఇద్దరి నటనను తాను ఎంతగానో గౌరవిస్తానన్నారు రాజమౌళి. దర్శకుడు రాఘవేంద్ర రావు.. సీనియర్ ఎన్టీఆర్‌కి ఇచ్చిన మాటతో ‘స్టూడెంట్ నెం 1’ ప్రాజెక్టు తన దగ్గరకు వచ్చిందని రాజమౌళి చెప్పాడు. అప్పటికే యాడ్స్, సీరియల్స్‌లో దర్శకుడిగా, క్రియేటివ్ డైరెక్టర్‌గా విజయాలు అందుకోవడంతో.. ఈ అవకాశం వచ్చిందన్నాడు.

ఇవి కూడా చదవండి

అప్పటి ‘శాంతి నివాసం’ సీరియల్ బాధ్యతలను తన సహ దర్శకుడికి అప్పగించి.. తన మొదటి సినిమా మొదలుపెట్టానని రాజమౌళి చెప్పాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్‌ను మొదటిసారి చూసినప్పుడు ‘ఓరి దేవుడో.! వీడు దొరికాడేంటి.. నా ఫస్ట్ సినిమాకి’ అని అనుకున్నానని.. అయితే తనది ‘కుంటి గుర్రంతో రేస్ నెగ్గితే ఇంకా గొప్ప కదా’ అనే మెంటాలిటీ అని.. హీరో అంత బాగోకపోయినా మనం బాగా తీస్తే ఎక్కువ పేరు వస్తుందని అనుకుని సినిమా మొదలుపెట్టానని చెప్పాడు. సినిమా మొదలైన 10 రోజులకు ఎన్టీఆర్ నటన ఏంటో.? తనలో అద్భుతమైన నటుడిని గుర్తించానని తెలిపాడు. సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ కొంత ఇబ్బందులను ఎదుర్కొందని.. ఆంధ్రావాలా, సాంబ, అశోక్, నరసింహుడు లాంటి హై వోల్టేజ్ యాక్షన్ సినిమాలు సింహాద్రి స్థాయికి చేరుకోలేకపోయాయని రాజమౌళి గుర్తు చేశాడు. యమదొంగకు ముందు రాఖీ సినిమా కొంత ఊరటనిచ్చిందని.. ఆ తర్వాత తామిద్దరం చేసిన యమదొంగ సినిమా యాక్షన్ ఓరియెంటేషన్ కాదని, గ్రాఫిక్స్‌తో ఒక కొత్త తరహా చిత్రంగా నిలిచిందని పేర్కొన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ తరచుగా తనతో సినిమా తీస్తేనే హిట్లు వస్తాయని అంటాడని, అయితే వారి మధ్య ఉన్న స్నేహం మాత్రం విజయాలతో రాలేదని రాజమౌళి స్పష్టం చేశాడు.

ఇది చదవండి: సామాన్య వ్యక్తిని కూడా కోటీశ్వరుడిని చేయొచ్చు..! ఇది తెలిస్తే శాలరీ లేకపోయినా హ్యాపీగా బ్రతికేయొచ్చు

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..