Sonu Sood: 52 ఏళ్లలో సిక్స్ ప్యాక్.. రియల్ హీరో సోనూసూద్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే.. మరీ ఇంత సింపులా?
యంగ్ హీరోలు సిక్స్ ప్యాక్ చేయడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ 52 ఏళ్ల వయసులోనూ సిక్స్ ప్యాక్ బాడీతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు రియల్ హీరో సోనూసూద్. మరి ఈ వయసులోనూ కుర్ర హీరోలకు సవాల్ విసురుతోన్న సోనూ ఫిట్ నెస్ సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం రండి.

తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నటుడిగా రాణిస్తున్నారు సోనూసూద్. హీరోగా, విలన్ గానే కాకుండా డైరెక్టర్ గానూ, నిర్మాతగానూ సత్తా చాటుతున్నారీ హ్యాండ్సమ్ యాక్టర్. ఇక సోనూసూద్‌ను కోట్లాదిమంది ఇష్టపడడానికి, అభిమానించడానికి మరో కారణం ఆయన చేస్తోన్న సేవా కార్యక్రమాలు. సినిమాల్లో విలన్‌గా కనిపించిన సోనూసూద్ నిజ జీవితంలో మాత్రం ఎందరికో సాయం అందించి రియల్ హీరో అనిపించుకున్నారు. ముఖ్యంగా కరోనా కాలంలో అతను అందించిన సేవలను ఎవరూ మర్చిపోలేరు. ఇప్పటికీ సాయమడిగిన వారికి కాదనకుండా ఆపన్న హస్తం అందిస్తున్నారీ హ్యాండ్సమ్ యాక్టర్. ఇదిలా ఉంటే ఇప్పుడు తన ఫిట్ నెస్ తోనూ వార్తల్లో నిలుస్తున్నారు సోనూసూద్. 52 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్ బాడీతో స్టిల్ యంగ్ గా, ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు. మరి ఈ వయసులోనూ తన ఫిట్ నెస్ తో కుర్ర హీరోలకు సవాల్ విసురుతోన్న సోనూసూద్ ఫిట్‌నెస్ రహస్యం ఏంటో తెలుసుకుందాం రండి.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనూసూద్ తన ఫిట్‌నెస్ సీక్రెట్స్ ను వెల్లడించాడు. ‘ఫిట్‌నెస్ అనేది ఒక దశ కాదు, ఒక జీవనశైలి అని నేను ఎప్పుడూ నమ్ముతాను. నేను శుభ్రమైన, ప్రోటీన్ అధికంగా ఉండే భోజనం తీసుకుంటాను. ఇక డైలీ రొటీన్ విషయానికి వస్తే.. ప్రతిరోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగుతాను. గంటపాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్, కార్డియోతో పాటు ధ్యానం కూడా చేస్తాను. కఠినమైన డైట్ పాటించను. ఇంటి భోజనమే తింటాను. తేలికగా, పోషకంగా, సులభంగా జీర్ణం అయ్యే ఫుడ్ ఎక్కువగా తీసుకుంటాను. ఇక సాధారణంగా శక్తి కోసం తాజా పండ్లు, గింజలు, మొలకలు, కాయధాన్యాలపై ఎక్కువగా ఆధారపడతాను. ఇక షూటింగ్ రోజుల్లో నూ దాదాపు ఇదే ఆహారం తీసుకుంటాను. కాల్చిన శనగలు, ఫ్రూట్ బౌల్స్, అలాగే ఇంట్లో తయారు చేసిన సింపుల్ ప్రొటీన్ స్నాక్స్ తీసుకుంటాను’ అని సోనూసూద్ చెప్పుకొచ్చారు.
సిక్స్ ప్యాక్ బాడీతో సోనూసూద్..
View this post on Instagram
ఇక సినిమాల విషయానికి వస్తే.. చివరగా ‘ఫతే’ అనే హిందీ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు సోనూసూద్. ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు నిర్మాతగానూ, దర్శకుడిగానూ సత్తా చాటాడు. దీని తర్వాతి ప్రాజెక్టు గురించి సోనూసూద్ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




