పండుగవేళ చుక్కలనంటుతున్న మాంసం ధరలు
సంక్రాంతి పండుగ సందర్భంగా నాన్-వెజ్ ప్రియులకు ధరల షాక్ తగులుతోంది. గోదావరి జిల్లాల్లో చేపలు, చికెన్ ధరలు సాధారణం కంటే రెట్టింపు అయ్యాయి. కనుమ, ముక్కనుమ రోజుల్లో నాన్-వెజ్ తప్పనిసరి కావడంతో, మార్కెట్లకు క్యూ కడుతున్న వినియోగదారులకు పెరిగిన ధరలు భారంగా మారాయి.
సంక్రాంతి పండుగ అంటే కొత్త అల్లుళ్లు, కోడిపందాలు సందడే సందడి. రకరకాల పిండి వంటలు, వెజ్, నాన్‌వెజ్ వంటకాలతో కొత్త అల్లుడికి విందు ఏర్పాటు చేయడం ఆంధ్రా స్పెషల్. ఇదిలా ఉంటే పండగవేళ చికెన్, మటన్ ధరలే కాదు, చేపల ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. అయినాసరే, కొత్త అల్లుడికి కోడికూర, చేపలపులుసు పెట్టి తీరాల్సిందే అన్నట్టుగా అందరూ ఎగబడి కొంటున్నారు. ఈ క్రమంలో విశాఖ ఫిషింగ్ హార్బర్ జనాలతో కిటకిటలాడుతోంది. సాధారణ చేపలు కూడా కేజీ రూ.600 నుంచి 700 పలుకుతున్నాయి. రొయ్యలు కూడా కిలో ఏకంగా రూ.1400లు పలుకుతున్నాయి.విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో రద్దీ… చేపల ధరలపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ఖాజా అందిస్తారు.
మరిన్ని వీడియోల కోసం :
టాలీవుడ్ కు సెకండ్ హోమ్ గా మారుతున్న జపాన్ వీడియో
కర్మకాండకు రెడీ చేస్తుండగా.. బతికే ఉన్నానంటూ ఫోన్!
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
రైలు 2 గంటలు లేటైతే అవన్నీ ఫ్రీ… IRCTC రూల్ మీకు తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో మాంజా డేంజర్‌బెల్స్.. వరుస ప్రమాదాలతో టెర్రర్
పండుగవేళ చుక్కలనంటుతున్న మాంసం ధరలు
కోనసీమలో మొదలైన ప్రభల తీర్థం
EPFO గుడ్ న్యూస్.. అందుబాటులోకి ఆ సేవలు
స్మార్ట్‌ఫోన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్..భారీగా పెరగనున్న ధరలు!
టైగర్ సఫారీలో జీప్‌లో పర్యాటకులు..కళ్ళెదుట ఆ సీన్ చూసి షాక్
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
