AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kantara Chapter 1: కాంతార చాప్టర్ 1లో మాయావిగా కనిపించిన ఈ నటుడు ఎవరో తెలుసా.. ? ఇండస్ట్రీలో క్రేజీ హీరో..

దసరా పండక్కి భారీ అంచనాల మధ్య విడుదలైన కాంతార చాప్టర్ 1 ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తుంది. ఇప్పటికే రూ.500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా దూసుకుపోతుంది. ఈ చిత్రానికి అన్ని వర్గాల అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. కన్నడ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా రాణిస్తుంది.

Kantara Chapter 1: కాంతార చాప్టర్ 1లో మాయావిగా కనిపించిన ఈ నటుడు ఎవరో తెలుసా.. ? ఇండస్ట్రీలో క్రేజీ హీరో..
Rishab Shetty
Rajitha Chanti
|

Updated on: Oct 23, 2025 | 10:50 AM

Share

కాంతార చాప్టర్ 1.. ఇప్పుడు పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న సినిమా. దసరా పండక్కి థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. 2022లో సూపర్ హిట్ అయిన కాంతార చిత్రానికి ప్రీక్వెల్ ఇది. భారీ అంచనాల మధ్య అక్టోబర్ 2న అడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ రికార్డ్స్ కొల్లగొడుతుంది. ఇప్పటికీ రూ.500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రానికి రోజు రోజుకి మరిన్ని వసూల్లు పెరుగుతున్నాయి. కన్నడ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఆయన ప్రధాన పాత్ర పోషించగా.. రుక్మిణి వసంత్ కథానాయికగా నటించింది. అలాగే గుల్షన్ దేవయ్య, జయరామ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాలోని విజువల్స్, ఇంటర్వెల్ బ్లాక్, సెకండ్ హాఫ్ ట్విస్ట్, క్లైమాక్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఇవి కూడా చదవండి : Actress: ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలి బ్రహ్మాకుమారిగా.. 45 ఏళ్ల వయసులో ఇలా.. గుర్తుపట్టారా.. ?

ఇక ఈ సినిమాలో రిషబ్ శెట్టి యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో రుక్మిణి వసంత్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇక ఇందులోని మ్యూజిక్ సైతం శ్రోతలను కట్టిపడేసింది. అయితే ఈ సినిమాలో మాయావి పాత్ర మరో హైలెట్. క్లైమాక్స్ లో మాత్రమే కనిపించే ఈ పాత్రలో ఓ స్టార్ హీరో నటించారు. ఇందులో బర్మ కుంగిపోయిన ప్రతీసారి వెన్నుతట్టి లేపుతుంటాడు. అయితే ఈ చిత్రంలో మాయావి పాత్రలో కనిపించిన ఆ హీరో ఎవరో తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో మాయావి పాత్రలో కనిపించింది మరెవరో కాదు.. కన్నడ హీరో రిషబ్ శెట్టి.

ఇవి కూడా చదవండి : Actress : నాగార్జున, రజినీకాంత్‏తో సినిమాలు.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. ఈ చిన్నారి నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా..?

కాంతార చాప్టర్ 1 చిత్రంలో రిషబ్ శెట్టి డ్యూయల్ రోల్ చేశారు. అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. కాంతార చాప్టర్ 1 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రిషబ్.. ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జై హనుమాన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రూ.100 కోట్లతో నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇవి కూడా చదవండి : Cinema : ఇవేం ట్విస్టులు రా అయ్యా.. ఊహించని మలుపులు.. ఈ సినిమాను అస్సలు మిస్సవ్వద్దు..

ఇవి కూడా చదవండి : Actress : శ్రీదేవికి వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరోయిన్.. ఒకప్పుడు డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్.. చివరకు ఊహించని విధంగా..