Hyderabad: ఇద్దరూ కలిసి గుట్టుగా ఆ యాపారం.. కట్ చేస్తే, పోలీసుల ఎంట్రీతో..
పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా.. కఠిన చర్యలు తీసుకుంటున్నా.. మత్తుగాళ్లు మారడంలేదు. హైదరాబాద్‌తోపాటు శివారు ప్రాంతాల్లో ఏదో ఒక ప్రాంతంలో డ్రగ్స్, గంజాయి స్మగ్లర్లు పట్టుబడుతునే ఉన్నారు. దీంతో హైదరాబాద్‌లో డ్రగ్స్‌పై పోలీసుల వేట కొనసాగుతోంది. రాజేంద్రనగర్‌లో ఇద్దరు వ్యక్తులు డ్రగ్స్‌తో పట్టుబడడం కలకలం రేపుతోంది.

పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా.. కఠిన చర్యలు తీసుకుంటున్నా.. మత్తుగాళ్లు మారడంలేదు. హైదరాబాద్‌తోపాటు శివారు ప్రాంతాల్లో ఏదో ఒక ప్రాంతంలో డ్రగ్స్, గంజాయి స్మగ్లర్లు పట్టుబడుతునే ఉన్నారు. రీసెంట్‌గా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని హసన్‌నగర్‌లో ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు చేపట్టడంతో ఇద్దరు వ్యక్తులు దొరికిపోయారు. డ్రగ్స్‌కు సంబంధించి పక్కా సమాచారంతో పోలీసులు ప్రత్యేక బృందాలతో దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
పట్టుబడ్డవారి నుంచి MDMA డ్రగ్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన పోలీసులు.. A1 అన్వర్ హుస్సేన్ చింతల్‌మెట్ నివాసిగా.. A2 బుర్ర సంపత్ బండ్లగూడ ప్రాంతానికి చెందినవాడిగా తేల్చారు. ఇద్దరు వ్యక్తులకు ఈ డ్రగ్‌ను ఎక్కడి నుంచి తెచ్చారు?.. ఎవరి ద్వారా సరఫరా జరిగింది?.. గతంలో డ్రగ్ కేసుల్లో వీరి ప్రమేయం ఉందా?.. అనే అంశాలపై రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు విచారిస్తున్నారు.
ప్రాథమిక విచారణ తర్వాత ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించిన పోలీసులు.. ఈ కేసుపై స్పెషల్ ఫోకస్ పెట్టి.. ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనేది తేల్చనున్నారు. మొత్తంగా.. హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మత్తు మహమ్మారిని వదిలించడమే లక్ష్యంగా కీలక ఆపరేషన్లు నిర్వహిస్తుండడంతో డ్రగ్స్ స్మగ్లర్లలో వణుకు పుడుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
