- Telugu News Photo Gallery Cinema photos Can You Guess This Actress In this Photo, She Is Tollyaood Heroine Madonna Sebastian
Tollywood : బీచ్లో అందాల బీభత్సం.. బ్లాక్ డ్రెస్లో హీట్ పెంచిన టాలీవుడ్ హీరోయిన్..
ఇటీవల కాలంలో హీరోయిన్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. నిత్యం క్రేజీ ఫోటోషూట్లతో, గ్లామర్ ఫోజులతో మతిపోగొట్టేస్తున్నారు. వెండితెరపై అభినయంతో అల్లాడించిన తారలు.. నెట్టింట మాత్రం గ్లామర్ అరాచకం సృష్టిస్తున్నారు. తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ ఇప్పుడు బీచ్లో అందాల బీభత్సం సృష్టిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరంటే..
Updated on: Oct 23, 2025 | 10:31 AM

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వయ్యారి షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. పైన ఫోటోలో బీచ్ లో బ్లాక్ డ్రెస్ లో అందాల బీభత్సం సృష్టిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? తెలుగు, తమిళం, మలయాళం భాషలలో వరుస సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తక్కువ సమయంలోనే తనదైన ముద్ర వేసింది.

ఆమె మరెవరో కాదండి. హీరోయిన్ మడొన్నా సెబాస్టియన్. నటనతోనే కాదు.. గ్లామర్ తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా బీజ్ ఒడ్డున సేద తీరుతూ అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ లో అందాలు ఆరబోస్తూ సముద్రుడికే చెమటలు పట్టించేలా అందాలతో హీటెక్కించేసింది ఈ ముద్దుగుమ్మ.

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. దీంతో ఈ బ్యూటీ అందం రోజు రోజుకీ పెరుగుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు.. ఈ బ్యూటీకి రోజు రోజుకీ ఫాలోవర్స్ సైతం పెరిగిపోతున్నారు. ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది.

ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం భాషలలో నటిస్తుంది. 1922 అక్టోబర్ 1న కేరళలోని కన్నూర్ లోని చెరుపూజాలో జన్మించింది. బెంగళూరులోని క్రైస్ట్ యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.

ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రేమమ్ సినిమాతో తొలిసారిగా వెండితెరకు పరిచయమైన ఈ అమ్మడు.. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంది. ఎక్కువగా తమిళం, మలయాళం భాషలలో నటించింది. ప్రస్తుతం ప్రభాస్, సందీప్ రెడ్డి కాంబోలో రాబోతున్న స్పిరిట్ చిత్రంలోనూ కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.




