AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమేజింగ్.. జింగ్.. జింగ్.! ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి 5 ఏళ్లలో కోటీశ్వరుడిగా మారొచ్చు.. లాటరీ టికెట్ కాదు

రాబోయే బడ్జెట్‌లో రైల్వేకు కేటాయింపులు భారీగా ఉంటాయని చర్చలు సాగుతున్నాయ్. రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి, వందేభారత్ రైళ్లు, ప్రైవేట్ రైళ్ల రాకతో 2026లో ఈ రంగంలో గణనీయమైన వృద్ధికి అంచనా. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

అమేజింగ్.. జింగ్.. జింగ్.! ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి 5 ఏళ్లలో కోటీశ్వరుడిగా మారొచ్చు.. లాటరీ టికెట్ కాదు
Multibagger
Ravi Kiran
|

Updated on: Jan 16, 2026 | 11:28 AM

Share

రాబోయే బడ్జెట్‌లో రైల్వేకు కేటాయింపులు భారీగా ఉంటాయని చర్చలు సాగుతున్నాయ్. బడ్జెట్‌లో రైల్వేలకు కేటాయింపులు గణనీయంగా పెరిగే అవకాశం ఉండడంతో, ఈ రంగంలోని స్టాక్స్‌పై పెట్టుబడిదారులు దృష్టి సారిస్తున్నారు. భవిష్యత్తులో రైల్వే రంగంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుని అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వందేభారత్ రైళ్ళు, ట్రాక్‌ల ఆధునీకరణ, రైల్వే ప్లాట్‌ఫామ్‌ల అభివృద్ధి, ప్రైవేట్ రైళ్ల రాకతో ఈ రంగం వృద్ధికి తోడ్పడుతున్నాయి. 2026-27 నాటికి భారత రైల్వే రూపురేఖలు పూర్తిగా మారే అవకాశం ఉంది.

ఇది చదవండి: ‘ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా తీశాడు..’

ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక పెట్టుబడికి అనుకూలమైన కొన్ని రైల్వే స్టాక్స్‌ను బిజినెస్ నిపుణులు సూచిస్తున్నారు. జూపిటర్ వాగన్స్, రైల్‌టెల్, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఆర్‌ఎఫ్‌సీ), రైల్ వికాస్ నిగమ్, టిటాగర్ రైల్, బిఈఎమ్ఎల్, టెక్స్మో రైల్, ట్రాన్స్‌జిల్ లైటింగ్, ఐఆర్‌సిటిసి లాంటి కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ కంపెనీలు రైల్వే రంగానికి అవసరమైన బోగీలు, ఫైనాన్సింగ్, మౌలిక సదుపాయాల కల్పన, సిగ్నలింగ్ వ్యవస్థలు, ఇంజిన్‌లు లాంటి వివిధ సేవలను అందిస్తున్నాయి. బడ్జెట్ కేటాయింపులు, ప్రభుత్వ విధానాలు ఈ స్టాక్స్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తాయి. దీర్ఘకాలిక లక్ష్యాలతో పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఈ కంపెనీల పనితీరును పరిశీలించాలని సూచిస్తున్నారు. కాగా, ఏదైనా స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలంటే.. ముందుగా ఆర్ధిక నిపుణుడి సలహాలు తీసుకోవడం ముఖ్యమని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: సామాన్య వ్యక్తిని కూడా కోటీశ్వరుడిని చేయొచ్చు..! ఇది తెలిస్తే శాలరీ లేకపోయినా హ్యాపీగా బ్రతికేయొచ్చు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి