చికెన్, మటన్ లివర్ పోషకాలతో కూడిన ఆహారం. ఐరన్, విటమిన్ A, B12, ప్రోటీన్లతో రక్తహీనత, కంటి ఆరోగ్యం, కండరాలకు మేలు. అయితే అధిక కొలెస్ట్రాల్, యూరిక్ యాసిడ్ పెంచుతుంది. గుండె జబ్బులు, కీళ్లనొప్పులు, విటమిన్ A టాక్సిసిటీకి దారి తీయవచ్చు. గర్భిణీలు, కాలేయ సమస్యలున్నవారు జాగ్రత్త. వారానికి ఒకటి లేదా రెండుసార్లు, పూర్తిగా ఉడికించి, వైద్య సలహాతో పరిమితంగా తీసుకోవడమే ఉత్తమం.