AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోడి పందేలు, జల్లికట్టు వారసత్వంగా వచ్చినవే.. చిన్నప్పుడు అన్నీ చూశాః చంద్రబాబు

అందరికీ పుట్టిన ఊరు జన్మభూమిపై మమకారం ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ మధ్యకాలంలో ఆర్థిక అసమానతలు ఎక్కువయ్యాయని అందుకే పీ4 ను తీసుకొచ్చామన్నారు. 10 లక్షల కుటుంబాలను పీ4 ద్వారా దత్తత తీసుకున్నామన్నారు. సంక్రాంతి రైతుల పండుగని, పెద్దల పండుగ గా పూర్వీకులకు పూజలు చేసుకుని నివాళులు అర్పించాలన్నారు.

కోడి పందేలు, జల్లికట్టు వారసత్వంగా వచ్చినవే.. చిన్నప్పుడు అన్నీ చూశాః చంద్రబాబు
Cm Chandrababu Naidu On Swarna Naravaripalle
Raju M P R
| Edited By: |

Updated on: Jan 16, 2026 | 1:33 PM

Share

అందరికీ పుట్టిన ఊరు జన్మభూమిపై మమకారం ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ మధ్యకాలంలో ఆర్థిక అసమానతలు ఎక్కువయ్యాయని అందుకే పీ4 ను తీసుకొచ్చామన్నారు. 10 లక్షల కుటుంబాలను పీ4 ద్వారా దత్తత తీసుకున్నామన్నారు. సంక్రాంతి రైతుల పండుగని, పెద్దల పండుగ గా పూర్వీకులకు పూజలు చేసుకుని నివాళులు అర్పించాలన్నారు. రైతులు ఆనందం ఉన్నారని వారసత్వంగా జల్లికట్టు, కోడి పందేలు జరుపుకుంటున్నామన్నారు. చిన్నప్పుడు ఇవన్నీ సంప్రదాయంగా జరుకున్నామన్నారు. పండుగలు ఆనందాన్ని ఇస్తాయన్నారు.

పెద్దల పండగ సంక్రాంతిని సొంతూరు నారావారిపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంబరంగా జరుకున్నారు. నాలుగు రోజుల పాటు నారావారి పల్లి లోనే కుటుంబ సభ్యులు బంధువులతో గడిపిన సీఎం సంక్రాంతి రోజు గ్రామ దేవత దొడ్డి గంగమ్మ, నాగాలమ్మకు, తల్లిదండ్రుల సమాధులకు పూజలు నిర్వహించారు. ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాలకు నారా నందమూరి కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించిన చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు.

స్వర్ణ నారావారిపల్లి ద్వారా జీవన ప్రమాణాలు పెంచుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. హంద్రీ నీవా నీటిని మూలపల్లి చెరువు ద్వారా కళ్యాణి డ్యామ్ కు తరలిస్తామన్న సీఎం ఆరోగ్యకరమైన సమాజం రావాల్సి ఉందన్నారు. కుప్పంలో సంజీవినీ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యిందని ఈ ఏడాదిలో సంజీవిని కార్యక్రమం రాష్ట్రమంతా అమలు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇక జనాభా తగ్గిపోతోందని దానిపై దృష్టి పెట్టామన్నారు. రాబోయే ఏడాదిలో ఎక్కడికక్కడ ఆదాయం పెంచే ప్రయత్నం చేస్తామన్నారు. అవిలాల చెరువు హైద్రాబాద్ ట్యాంక్ బండ్ కంటే బాగా అభివృద్ది చేస్తామన్నారు. తిరుపతి, విశాఖ, అమరావతిలను మెగా సిటీలుగా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.

ఎట్టకేలకు శెట్టిపల్లి భూములకు పరిష్కారం

సీఎం దిశానిర్దేశంతో 636 ఎకరాల శెట్టిపల్లి భూములకు పరిష్కారం లభించింది. లాటరీ పద్ధతిలో పారదర్శకంగా 2,111 మందికి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా రూ.16 కోట్ల రిజిస్ట్రేషన్, స్టాంప్ ఫీజు మినహాయింపు ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ విధానంలో భూముల పంపిణీ చేసిన ప్రభుత్వం శెట్టిపల్లి ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందనుందన్న సంకేతాన్ని ఇచ్చింది. చాలా కాలం నుండి పరిష్కారం కాని శెట్టిపల్లి భూముల సమస్యను పరిష్కరించి ఆన్లైన్ లాటరీ పద్ధతిలో భూములు కేటాయించింది.

స్వర్ణ నారావారిపల్లి గ్రామీణాభివృద్ధిలో దేశానికే దిక్సూచి

స్వర్ణకుప్పం, స్వర్ణ నారావారిపల్లి తరహాలోనే సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. స్వర్ణ చంద్రగిరి మండల అభివృద్ధి ప్రణాళికలను ప్రకటించిన సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. చంద్రగిరి మండలాన్ని అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దేందుకు స్వర్ణ చంద్రగిరి ప్రణాళికల్ని సీఎం ప్రకటించారు. లక్ష్యాన్ని సాధించేందుకు వీలుగా సీఎం ప్రణాళికల్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. చంద్రగిరి మండలంలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా ఈ అభివృద్ధి ప్రణాళికలను అమలు చేయనున్నారు.

గత ఏడాది సంక్రాంతికి ప్రారంభించిన స్వర్ణ నారావారిపల్లె ప్రాజెక్టు ద్వారా ఒక్క ఏడాదిలోనే అద్భుతమైన ఫలితాలు వెలుగు చూశాయి. ఏడాది కాలంలోనే అన్ని ఇళ్లకూ వంద శాతం సౌర ప్యానెళ్లను అమర్చడం ద్వారా ఇంధన స్వయం సమృద్ధిని సాధించింది. తద్వారా ప్రతీ ఇంటికీ ఉచితంగానే విద్యుత్ వెలుగులు వచ్చాయన్నారు.వంద శాతం సోలారైజేషన్ సాధించిన గ్రామంగా స్వర్ణ నారావారిపల్లె రికార్డులు సాధించగా ప్రజల తలసరి ఆదాయం లోనూ గణనీయమైన వృద్ధి నమోదైందన్నారు. శాస్త్రీయ పద్ధతుల్లో పాడిపరిశ్రమను ప్రోత్సహించడం, ప్రకృతి సేద్యం విస్తరణ తదితర ప్రణాళికల ద్వారా తలసరి ఆదాయం 20 శాతం మేర పెరిగిందన్నారు.

ముఖ్యమంగా మహిళలు, యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేలా ప్రత్యేక కార్యక్రమాలను సమర్ధంగా అమలు చేశామని సీఎం తెలిపారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సంతృప్త స్థాయిలో ప్రతీ లబ్దిదారుడికి చేరేలా అమలు చేయటంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పన స్వర్ణ నారావారిపల్లె ఏడాదిలోనే అద్భుత ఫలితాల సాధనకు ఉపకరించిందన్నారు. దీంతో చంద్రగిరి మండలం అంతటా ఈ ప్రాజెక్టును విస్తరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గత ఏడాది సంక్రాంతి పండుగ రోజు ప్రారంభించిన స్వర్ణ నారావారిపల్లె ప్రాజెక్టు సమగ్ర గ్రామీణాభివృద్ధిలో దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు. ఏడాది కాలంలో మూడు గ్రామ పంచాయతీల పరిధిలో ఈ ప్రాజెక్టు ఆశించిన లక్ష్యాలను మించి ఫలితాలను సాధించిందన్నారు స్వల్ప కాలంలోనే ఈ అభివృద్ధి సాధించేందుకు కారణమైన జిల్లా యంత్రాంగాన్ని, ప్రజాప్రతినిధుల్ని చంద్రబాబు అభినందించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..