AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Garlic: నల్లగా ఉన్నాయని తీసిపారేయకండి.. ఒక్క రెండు తిన్నారనుకోండి రోగాలన్నీ పారాహుషార్.!

నల్ల వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగపడతాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది, కాలేయాన్ని కూడా ఆరోగ్యకరంగా ఉంచుతుంది. ఘాటు ఉండదు. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి మరి.

Black Garlic: నల్లగా ఉన్నాయని తీసిపారేయకండి.. ఒక్క రెండు తిన్నారనుకోండి రోగాలన్నీ పారాహుషార్.!
Black Garlic
Ravi Kiran
|

Updated on: Jan 16, 2026 | 1:33 PM

Share

మసాలా దినుసుల నుంచి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అందులో వెల్లుల్లి ఒకటి. పచ్చి వెల్లుల్లిని తిననివారికి.. నల్ల వెల్లుల్లి మంచి ఆప్షన్. ఇవి తీపిగా ఉంటాయి. ఈ బ్లాక్ గార్లిక్‌ను 60 డిగ్రీల నుంచి 77 డిగ్రీల ఉష్ణోగ్రత, నిర్దిష్ట తేమ ఉన్న వాతావరణంలో 15 నుంచి 90 రోజుల పాటు నిల్వ ఉంచి తయారు చేస్తారు. దీనిని ఏజింగ్ ప్రక్రియ అని అంటారు.

ఇది చదవండి: సామాన్య వ్యక్తిని కూడా కోటీశ్వరుడిని చేయొచ్చు..! ఇది తెలిస్తే శాలరీ లేకపోయినా హ్యాపీగా బ్రతికేయొచ్చు

ఏజింగ్ ప్రక్రియలో భాగంగా వెల్లుల్లిలోని చక్కెరలు, అమినో యాసిడ్ల మధ్య రసాయన చర్య ఏర్పడి.. రెబ్బలు నల్లగా మారి, బాల్సమిక్ వెనిగర్ లాంటి తీపి రుచిని అందిస్తాయి. పచ్చి వెల్లుల్లిలా ఘాటు ఉండదు. నోటి దుర్వాసన కూడా రాదు. పచ్చి వెల్లుల్లిలోని అల్లిసిన్ నల్ల వెల్లుల్లిలో ఎస్-అల్లైల్ సిస్టీన్ అనే స్ట్రాంగ్ యాంటీఆక్సిడెంట్‌గా మారుతుంది. ఇది యాంటీఆక్సిడెంట్లను అధికంగా కలిగి ఉండి, శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తుంది.

నల్ల వెల్లుల్లి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది శరీరంలో వాపును తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని గణనీయంగా పెంచుతుంది. ఇందులో ఉండే సమ్మేళనాలు రక్తప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి. తద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది కాలేయాన్ని దెబ్బతినకుండా కాపాడుతుంది. వాయు కాలుష్యం వల్ల శరీరంలో చేరే టాక్సిన్లను బయటకు పంపిస్తుంది. అలాగే కొన్ని అధ్యయనాల ప్రకారం, నల్ల వెల్లుల్లిలో ఉండే రసాయనాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడంలో కూడా సహపడతాయి. పచ్చి వెల్లుల్లిని తినని వారికి.. నల్ల వెల్లుల్లి ఒ బెస్ట్ ఆప్షన్. దీని రుచి, ఘాటు లేకపోవడంతో.. రోజూ ఆహారంలో రెండు తిన్నారంటే.. అన్ని పుష్కలంగా లభిస్తాయి. నల్ల వెల్లుల్లి గుండెల్లో మంట లేదా ఎసిడిటీ సమస్యలు ఉన్నవారికి చాలా మంచిది. కాగా, 100 గ్రాముల నల్ల వెల్లుల్లి ఆన్‌లైన్‌లో రూ. 250 నుంచి రూ. 400 మధ్య లభిస్తుంది.

ఇది చదవండి: ‘ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా తీశాడు..’

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.