అంజీర్ పండ్లు తెలియని వారుండరు. ఇవి రుచికి తియ్యగా భలేగా ఉంటాయి. అందుకే చాలా మంది వీటిని ఇష్టంగా తింటూ ఉంటారు
TV9 Telugu
అంజీర్ పండ్ల రూపంలో, ఎండిన రూపంలో ఎలా తీసుకున్నా మంచిదే. అంజీర్ పండ్లు రుచిగా ఉన్నప్పటికీ వీటిని నిల్వ చేయడం కష్టం. ఇవి త్వరగా పాడవుతాయి
TV9 Telugu
అందుకే చాలా మంది ఎండిన అంజీర్ తినేందుకు ఇష్టపడతారు. అంజీర్ పండ్లల్లో ఫైటో కెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి
TV9 Telugu
అలాగే క్యాల్షియం, మెగ్నీషియం, భాస్వరం వంటి పోషకాలు కూడా ఉంటాయి. అంజీర్ పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది
TV9 Telugu
వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. పేగు కదలికలను పెంచి మలబద్దకం సమస్యను తగ్గించడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి
TV9 Telugu
మలబద్దకం సమస్యతో బాధపడే వారు వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే అంజీర్ పండ్లు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి
TV9 Telugu
వీటిలో పొటాషియంతోపాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడంతో పాటు గుండె కండరాలపై భారాన్నితగ్గించడంలో కూడా సహాయపడతాయి
TV9 Telugu
అంజీర్ పండ్లను తీసుకోవడం వల్ల ఎముకల సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఈ పండ్లల్లో క్యాల్షియం ఎముకల సాంద్రతను పెంచుతుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి