తక్కువ ధరలో లభించే పండ్లల్లో జామ ఒకటి. వీటిని నేరుగా తినడంతో పాటు స్నాక్స్, సలాడ్ రూపంలో, పానీయాల రూపంలో కూడా తీసుకుంటూ ఉంటారు
TV9 Telugu
జామ రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. జామకాయల్లో విటమిన్ సితో పాటు అనేక సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి
TV9 Telugu
రోజూ ఓ జామపండు తింటే శరీరానికి కావల్సిన విటమిన్ సి మొత్తం లభిస్తుంది. జామపండును తీసుకోవడం వల్ల మన మొత్తం శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది
TV9 Telugu
ఇందులోని విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీని వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు చర్మం బిగుతుగా తయారవుతుంది
TV9 Telugu
ఈ పండులో ఉండే ఫైబర్ గట్ బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. తద్వారా తిన్న ఆహారం సులభంగా జీర్ణమవ్వడంతో పాటు మలబద్దకం సమస్య కూడా తగ్గుతుంది
TV9 Telugu
జామలో పొటాషియం కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీంతో రక్తపోటు అదుపులో ఉంటుంది. అంతేకాకుండా శరీర బరువును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది
TV9 Telugu
ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆకలి త్వరగా వేయకుండా నిరోధిస్తుంది. దీంతో శరీర బరువు అదుపులో ఉంటుంది. జామపండును తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి
TV9 Telugu
ఆయుర్వేదం ప్రకారం జామపండును పగటిపూట తీసుకోవడం మంచిది. ఉదయం లైట్‌గా బ్రేక్‌ఫాస్ట్ చేసిన అనంతరం, మధ్యాహ్నం భోజనం చేసిన 2 గంటల తరువాత ఈ పండు తింటే జీర్ణం బాగా అవుతుంది. రాత్రి వేళల్లో మాత్రం అస్సలు తినకూడదు