AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sasivadane: ‘ప్రేమించాలని డిసైడ్ అయితే యుద్ధం చేయాల్సిందే’.. కోమలి ప్రసాద్ కొత్త సినిమా ట్రైలర్ చూశారా?

కోమలి ప్రసాద్.. ఈ మధ్యన టాలీవుడ్ లో బాగా వినిపిస్తోన్న హీరోయిన్ పేరు. ఆ మధ్యన నాని హిట్-3 సినిమాలో ఓ కీలక పాత్ర పోషించిన ఈ అందాల తార ఇప్పుడు మరో కొత్త సినిమాతో మన ముందుకు వస్తోంది. ఆమె నటించిన లేటెస్ట్ సినిమా శశివదనే

Sasivadane: ‘ప్రేమించాలని డిసైడ్ అయితే యుద్ధం చేయాల్సిందే’.. కోమలి ప్రసాద్ కొత్త సినిమా ట్రైలర్ చూశారా?
Sasivadane Movie Trailer
Basha Shek
|

Updated on: Sep 29, 2025 | 11:51 AM

Share

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన చిత్రం ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఎస్.వి.ఎస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల సినిమాను నిర్మించారు. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు. అక్టోబర్ 10న రిలీజ్ కానున్న ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ సోమవారం విడుదల చేశారు. ట్రైలర్‌ను గమనిస్తే.. ‘గల గల పారే గోదావరి గట్టుతో కళ కళలాడే అందమైన పల్లెటూరులో ఓ అమ్మాయిని చూడగానే తొలి చూపులోనే అబ్బాయికి ప్రేమ పడుతుంది. ప్రేమ ఆ చూపుతో మొదలైంది.. కాలం బొమ్మలా ఆగిపోయింది ఆమెతో పాటే నా మనసు కూడా మాయమైంది’ అనే డైలాగ్ హీరోయిన్‌పై హీరోకి లవ్ డెప్త్ ఏంటో చెబుతోంది. ‘లంకలోని సీత కోసం రాముడు సముద్రాలు దాటినట్లు.. నీ సైకిల్ పాప కోసం నువ్వు ఈ గోదారి దాటుతున్నావన్నమాట’ ఈ డైలాగ్ చూస్తే తన మనసుకి నచ్చిన ప్రేయసి కోసం హీరో గోదారి దాటి వెళ్లి అన్వేషిస్తాడని. దానికి తగినట్లుగానే సన్నివేశాలను చూపించారు.

చివరకు హీరోయిన్‌ కనపడగానే హీరో పడే భావోద్వేగ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ‘ఆడపిల్లలు మన జీవితంలోకి కోరికలతోను, ఆశలతోను రారురా..జీవితంలో తోడుగా ఉంటామని భరోసాతో వస్తారు… మనతో చేయ్యట్టుకుని ఏడడుగులు నడుస్తారు’.. ‘నాకు ఊహ తెలియని వయసు నుంచి నా అనుకున్న బంధం నాన్న.. ఉహ తెలిసిన తర్వాత నా అనుకున్న బంధం మీరు’ అంటూ హీరోయిన్‌కి హీరో తన ప్రేమను చెబితే, ‘ఇంత ప్రేమ నా నుంచి ఎప్పటికీ దూరం కాదుగా రాఘవ’ అంటూ హీరోయిన్ ప్రేమగా హీరోని రిక్వెస్ట్ చేసే సన్నివేశం ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ గాఢతను తెలియజేస్తోంది. ‘ప్రేమించాలని డిసైడ్ అయితే ఎన్నొచ్చిన యుద్ధం చేయాల్సిందే’ అని హీరోకి తండ్రి చెప్పటం చూస్తే ప్రేమలో హీరోకి ఎదురైన సమస్య గురించి తెలుస్తుంది.

అక్కడి నుంచి మనకు విలన్ పాత్ర ఎలా ఉండబోతుంది.. తన వల్ల హీరో పడ్డ ఇబ్బందులను ట్రైలర్‌లో చూపించే ప్రయత్నం చేశారు. ‘జాగ్రత్తగా వెళ్లి.. జాగ్రత్తగా తిరిగి రా’ అంటూ హీరోకి హీరోయిన్ జాగ్రత్త చెప్పటం, ‘ప్రేమతో వెళ్తున్నా.. వచ్చాక ప్రపంచాన్నే గెలుద్దాం’ అని హీరో చెప్పటం.. దానికి హీరో నుంచి హీరోయిన్ ప్రామిస్ తీసుకోవటంతో ట్రైలర్ ముగిసింది. గోదావరి నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథలోని సన్నివేశాలు ట్రైలర్‌లోనే హృదయాలను హత్తుకుంటుంటే సినిమాలో ఎమోషన్స్ ఎలా ఉండబోతున్నాయనే క్యూరియాసిటీ అయితే కలుగుతోంది. శరవణ వాసుదేవన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు. సాయికుమార్ దారా అందించిన విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. గ్యారీ బి.హెచ్. ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

శశివదనే సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..