AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్యాడ్ లక్ బ్యూటీ..! పోకిరి సినిమా వదులుకుంది.. కట్‌చేస్తే ప్రభాస్ సినిమాలో మెరిసింది..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమాలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది.

బ్యాడ్ లక్ బ్యూటీ..! పోకిరి సినిమా వదులుకుంది.. కట్‌చేస్తే ప్రభాస్ సినిమాలో మెరిసింది..
Pokiri
Rajeev Rayala
|

Updated on: Sep 29, 2025 | 11:59 AM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి, ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకుమారుడు, యువరాజు, ఒక్కడు, మురారి, పోకిరి, అతడు, దూకుడు ఇలా చాలా హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన మహేష్..  ప్రస్తుతం దర్శక ధీరుడు డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే.. మహేష్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ పోకిరి. డైరెక్టర్ పూరి జగన్నాథ్ రూపొందించిన ఈ సినిమా మహేష్ కెరీర్ ను మలుపు తిప్పింది.

అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు కుర్రాళ్లకు చమట్లు పట్టిస్తున్న భామ..! ఎవరో తెలుసా.?

నిజం, నాని, అర్జున్ వంటి సినిమాలతో వరుసగా డిజాస్టర్స్ అందుకుంటూ సతమతమవుతున్న మహేష్ బాబుకు.. భారీ విజయాన్ని అందించిన సినిమా ఇదే. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ షేక్ చేసింది. ఈ సినిమాలో మహేష్ యాక్టింగ్, లుక్స్, డైలాగ్స్ గురించి చెప్పక్కర్లేదు. అప్పట్లో మహేష్ మ్యానరిజం యూత్ ను ఓ ఊపు ఊపేసింది. మహేష్ బాబుకు మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టిన ఈ సినిమాలో ఇలియానా కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి జోడి ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. ఇక మణిశర్మ అందించిన మ్యూజిక్ సినిమాకే హైలెట్ అయ్యింది. కానీ పోకిరి సినిమాను మిస్ అయిన హీరోయిన్ ఎవరో మీకు తెలుసా.. ? నిజానికి ఈ సినిమాకు ఇలియానా ఫస్ట్ ఛాయిస్ కాదు. అప్పట్లో ఈ మూవీ కోసం బాలీవుడ్ హీరోయిన్ కావాలని అనుకున్నారట. అందుకే ముందుగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ను పోకిరి మూవీ కోసం ఎంపిక చేశారు.

ఇవి కూడా చదవండి

లక్షల్లో సంపాదిస్తున్నా..శ్మశానంలో ఆరు అడుగుల స్థలం మాత్రమే ఉంది.. సీరియల్ బ్యూటీ ఓపెన్ కామెంట్స్

అయితే ఈ సినిమా ఛాన్స్ వచ్చినప్పుడు కంగనా హిందీలో గ్యాంగ్ స్టార్ అనే సినిమా చేస్తుంది. దీంతో డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో పోకిరి సినిమాను తిరస్కరించింది. ఆమె స్థానంలోకి ఇలియానాను తీసుకున్నారట. అయితే పోకిరి సినిమాను మిస్ అయినందుకు కంగనా ఎంతో బాధపడినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. పోకిరి సినిమాను మిస్ అయిన కంగనా.. ప్రభాస్ సరసన ఏక్ నిరంజన్ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు.. రాజకీయాల్లో బిజీగా ఉంటుంది.

మంచి కొడుకును కాలేకపోయా.. జీవితం అయిపోయిందని బాధపడ్డా.. ఎమోష్నలైన షణ్ముఖ్ జశ్వంత్

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

40 ఏళ్ల తర్వాత మహిళల్లో జుట్టు రాలడం ఎందుకు పెరుగుతుంది?
40 ఏళ్ల తర్వాత మహిళల్లో జుట్టు రాలడం ఎందుకు పెరుగుతుంది?
పెట్టుబడి పెట్టాలంటే ఉండాల్సింది ఇదే.. వారెన్‌ బఫెట్‌ కీలక సూచన!
పెట్టుబడి పెట్టాలంటే ఉండాల్సింది ఇదే.. వారెన్‌ బఫెట్‌ కీలక సూచన!
నిండు సభలో లేడీ డాక్టర్ హిజాబ్‌ లాగిన CM నితీశ్‌.. వీడియో వైరల్
నిండు సభలో లేడీ డాక్టర్ హిజాబ్‌ లాగిన CM నితీశ్‌.. వీడియో వైరల్
డెబిట్ కార్డు ఉన్న వారికి బంపర్ ఆఫర్.. ఫ్రీగా జీవిత బీమా!
డెబిట్ కార్డు ఉన్న వారికి బంపర్ ఆఫర్.. ఫ్రీగా జీవిత బీమా!
నర్సరీ నుండి 5వ తరగతి వరకు పాఠశాలలు బంద్.. ఉత్తర్వులు జారీ!
నర్సరీ నుండి 5వ తరగతి వరకు పాఠశాలలు బంద్.. ఉత్తర్వులు జారీ!
మీరు తెలివైనవారైతే, ఈ గమ్మత్తైన గణిత సమస్యను సాల్వ్ చేయండి!
మీరు తెలివైనవారైతే, ఈ గమ్మత్తైన గణిత సమస్యను సాల్వ్ చేయండి!
పెళ్లి చేసుకునేటప్పుడు తెలియలేదారా..? నల్లగా ఉందని భార్యను అలా..
పెళ్లి చేసుకునేటప్పుడు తెలియలేదారా..? నల్లగా ఉందని భార్యను అలా..
ఆడవారికి ఉండే ఈ అలవాట్లే ఇంట్లో అశాంతికి కారణమట!
ఆడవారికి ఉండే ఈ అలవాట్లే ఇంట్లో అశాంతికి కారణమట!
తెలంగాణ పెన్షనర్లకు న్యూఇయర్ ముందే వచ్చేసింది..
తెలంగాణ పెన్షనర్లకు న్యూఇయర్ ముందే వచ్చేసింది..
జోడీల జాతర షురూ..2026లో సందడి చేయబోయే హీరో, హీరోయిన్స్ వీరే!
జోడీల జాతర షురూ..2026లో సందడి చేయబోయే హీరో, హీరోయిన్స్ వీరే!