AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంచి కొడుకును కాలేకపోయా.. జీవితం అయిపోయిందని బాధపడ్డా.. ఎమోష్నలైన షణ్ముఖ్ జశ్వంత్

యూట్యూబర్ షన్ముఖ్ జస్వంత్ గురించి చెప్పక్కర్లేదు. షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ ద్వారా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సాఫ్ట్ వేర్ డెవలపర్, సూర్య వెబ్ సిరీస్ ద్వారా స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. షన్ను నటించిన ఈ రెండు సిరీస్ సూపర్ హిట్స్ కావడంతో షన్నూ పేరు మారుమోగింది. దీంతో బిగ్ బాస్ కు ఛాన్స్ కూడా కొట్టేశాడు.

మంచి కొడుకును కాలేకపోయా.. జీవితం అయిపోయిందని బాధపడ్డా.. ఎమోష్నలైన షణ్ముఖ్ జశ్వంత్
Youtuber Shanmukh Jaswanth
Rajeev Rayala
|

Updated on: Sep 28, 2025 | 6:52 PM

Share

షణ్ముఖ్ జశ్వంత్.. ఇప్పుడు పెద్దగా ఫామ్ లో లేడు కానీ.. ఒకప్పుడు సోషల్ మీడియాలో ఈ పేరు చాలా పాపులర్. హీరో రేంజ్‏లో ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ ద్వారా యూట్యూబ్ స్టార్ గా పాపులర్ అయ్యాడు. షణ్ముఖ్ చేసిన ప్రతి షార్ట్ ఫిల్మ్ కొన్ని మిలియన్ వ్యూస్‏తో దూసుకుపోయాయి. కానీ కొన్ని నెలలుగా అడియన్స్ ముందుకు రాలేకపోయాడు షణ్ముఖ్. తెలుగులో అత్యధిక సబ్ స్క్రయిబర్స్ కలిగిన యూట్యూబర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు షన్నూ.. ఆ తర్వాత వ్యక్తిగత జీవితంలో ఎదురైన సమస్యలతో సతమతమయ్యాడు. నిత్యం ఏదోక వివాదంతో వార్తలలో నిలిచాడు. ప్రేమ, బ్రేకప్, అరెస్ట్.. ఇలా ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నాడు. చివరకు ఎలాంటి కంటెంట్ చేయకుండా.. ప్రేక్షకుల ముందుకు రాకుండా అజ్ఞాతంలో ఉండిపోయాడు.

పెళ్ళైన 11 రోజులకే భర్త మృతి.. 7 నెలల గర్భంతో రెండో పెళ్లి.. కట్ చేస్తే అతను కూడా..

షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే దీప్తి సునైనాతో ప్రేమాయణం నడిపాడు. కానీ ఆతర్వాత బిగ్ బాస్ సీజన్ 5లోకి విన్నర్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన షన్నూ.. చివరకు రన్నరప్ అయ్యాడు. బిగ్ బాస్ షో తర్వాత దీప్తితో బ్రేకప్ తో మానసికంగా ఒత్తిడికి గురయ్యాడు. కొన్నాళ్ల క్రితం గంజాయి సేవించాడని పోలీసులు అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత వాళ్ల అన్నయ్య ఓ అమ్మాయిని మోసం చేశాడని.. డ్రంక్ అండ్ డ్రైవ్ ఇలా ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నాడు. ఇక ఇప్పుడు హీరోగా మారి సినిమా చేస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

IMDbలో 7.2/10 రేటింగ్.. ఈ నలుగురు ఆడాళ్ళు మామూలోళ్లు కాదు.. ఒంటరిగా చూడాల్సిన సినిమా..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షణ్ముఖ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. నాకు చిన్నప్పటి నుంచి నటన అంటే ఇంట్రెస్ట్.. ఇదే విషయం మా నాన్నకు చెప్తే చెప్పు తెగుద్ది అన్నారు. అని తెలిపాడు షణ్ముఖ్. ఇక బిగ్ బాస్ షోకు వెళ్లకుండా ఉండాల్సింది. అనవసరంగా వెళ్ళాను అనిపించింది అని షాకింగ్ కామెంట్స్ చేశాడు షణ్ముఖ్. ఆతర్వాత ఓ కేసులో నా పేరొచ్చింది. అప్పుడు చాలా బాధపడ్డాను. దాని నుంచి బయటకు రాలేకపోయాను..నా జీవితం ఇంకా అయిపొయింది అనుకున్నాను అని అన్నాడు. మొన్నామధ్య మా నాన్న ఓ ప్రమాదానికి గురయ్యారు. రైలు ఎక్కబోయి బీపీ తగ్గడంతో కిందపడిపోయారు. ఆ రోజు నేను ఏడవలేదు. ఆ బాధను నాలోనే దిగమింగుకున్నా.. ఎందుకంటే అప్పుడు మా అమ్మకు క్యాన్సర్.. సర్జరీ చేశారు. నాన్నకు ఇలా జరిగింది అని చెప్తే తట్టుకోలేదు. ఏడ్చేస్తుంది.. కుట్లు విడిపోతాయి అందుకే ఆ బాధను నాలోనే దాచుకున్నాను. కానీ నేను మా నాన్నకు మంచి కొడుకును కాలేకపోయాను అంటూ ఎమోష్నలయ్యాడు షణ్ముఖ్.

అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు కుర్రాళ్లకు చమట్లు పట్టిస్తున్న భామ..! ఎవరో తెలుసా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.