AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మమ్మల్ని పట్టించుకోడు.. కన్నవాళ్లతో మాట్లాడడు.. కళ్యాణ్ గురించి తండ్రి ఎమోషనల్ కామెంట్స్

బిగ్ బాస్ సీజన్ 9 రోజు రోజుకు రసవత్తరంగా సాగుతుంది. ఇప్పుడు మూడో వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వస్తారా అని ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే శ్రష్టివర్మ మొదటివారం బయటకు వచ్చింది. అలాగే రెండో వారంలో మర్యాద మనీష్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు.

మమ్మల్ని పట్టించుకోడు.. కన్నవాళ్లతో మాట్లాడడు.. కళ్యాణ్ గురించి తండ్రి ఎమోషనల్ కామెంట్స్
Kalyan Padala
Rajeev Rayala
|

Updated on: Sep 27, 2025 | 4:13 PM

Share

బిగ్ బాస్ హౌస్ లోకి కామనర్ గా అడుగుపెట్టాడు కళ్యాణ్ పడాల. కళ్యాణ్ ఒక సోల్జర్ . అగ్నిపరీక్షలో మెప్పించిన కళ్యాణ్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు. కానీ బిగ్ బాస్ హౌస్ లో మనోడు గేమ్ కంటే అమ్మాయిలతో ముచ్చట్లతోనే కాలం గడుపుతున్నాడు. ఇప్పటివరకు కళ్యాణ్ గేమ్ లో అంతగా యాక్టివ్ గా కనిపించలేదు. హౌస్ లో ఎప్పుడు చూసిన రీతూ చౌదరితో పులిహోర కలుపుతూ కనిపిస్తున్నాడు కళ్యాణ్. ఈవారం నామినేషన్స్ లోనూ ఉన్నాడు కళ్యాణ్. తాజాగా కళ్యాణ్ గురించి అతని తండ్రి షాకింగ్ కామెంట్స్ చేశాడు. కొడుకు తమను పట్టించుకోడు అని చెప్పి షాక్ ఇచ్చాడు కళ్యాణ్ పడాల తండ్రి. తల్లిదండ్రులను పట్టించుకోడు.. నాతో మాట్లాడాడు.. ఎపుడూ బయట తిరుగుతూనే ఉంటాడు అని చెప్పాడు కళ్యాణ్ తండ్రి.

హీరోయిన్‌గా ఇండస్ట్రీని ఊపేసింది.. నాగార్జున మాత్రం రిజెక్ట్ చేశాడు.. ఆమె ఎవరో తెలుసా.?

తాజాగా కళ్యాణ్ పడాల తండ్రి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కొడుకు గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. మాది ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం.. చిన్న షాప్ పెట్టుకొని కష్టపడి కొడుకును చదివించుకున్నా.. మా కుటుంబంలో మా బాబాయి, అన్నయ్య పోలీస్ జాబ్ చేస్తున్నారు. దాంతో కళ్యాణ్ ను కూడా పోలీస్ చేయాలనుకున్నా.. కానీ కళ్యాణ్ జాబ్ చేయనన్నాడు. కళ్యాణ్ కు బయట తిరుగుళ్ళు ఎక్కువ.. జాబ్ చేయమని, నీ సంపాదనలో రూపాయి కూడా మాకు వద్దు, కష్టపడి చదివించాను.. జాబ్ చేయమని బలవంతపెడితే ఆర్మీలో చేరాడు అని చెప్పారు.

తండ్రి సమోసాలు అమ్మేవాడు.. ఇప్పుడు కూతురు కోట్లకు మహారాణి.. స్టార్ సింగర్ ఆమె..

కానీ ఆర్మీలో చేరిన తర్వాత కళ్యాణ్ నాపైన కోపం పెంచుకున్నాడు. నాతో మాట్లాడటం మానేశాడు. దాదాపు 14నెలలు నాతో మాట్లాడలేదు. ఫోన్ చేసినా కూడా కట్ చేసేవాడు. ఇంటికి వచ్చినా కూడా మాతో మాట్లాడేవాడు కాదు. మాతో కలిసి 5నిముషాలు కూర్చొని కష్టసుఖాలు అడిగి తెలుసుకోడు. సెలవులకు ఇంటికి వచ్చినా ఫ్రెండ్స్ తో తిరిగేవాడు. అదేంట్రా అని అడిగితే.. నేను మీకోసం రాలేదు.. ఫ్రెండ్స్ తో తిరగడానికి వచ్చాను అని చెప్పేవాడు. వాడికి ఎలా ఉండాలో తెలియదు. ఇప్పటికీ స్నానానికి వెళ్తే బకెట్ లో నీళ్లు నేనే నింపాలి. అన్ని పనులు మేమే చేయాలి. ఫస్ట్ ఇయర్ అవ్వగానే జాబ్ వచ్చింది. చేయను అని చెప్పాడు.. జాబ్ చేయకపోతే ఇంటికి రావద్దు అని చెప్పా.. అప్పుడు అలా చెప్పాను కాబట్టే ఇప్పుడు ఇలా ఉన్నాడు. లేకపోతే ఇలా ఉండేవాడు కాదు. ఆరోజు అలా వదిలేస్తే ఈరోజు ఇలా ఉండేవాడు కాదు అని చెప్పుకొచ్చాడు కళ్యాణ్ తండ్రి.

ఇవి కూడా చదవండి

అయ్యో పాపం.! కూరలో కరివేపాకులా లేపేశారు..!! ఓజీలో ఈ క్రేజీ బ్యూటీని కట్ చేశారు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.