AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తండ్రి సమోసాలు అమ్మేవాడు.. ఇప్పుడు కూతురు కోట్లకు మహారాణి.. స్టార్ సింగర్ ఆమె..

చాలా మంది సినిమా ఇండస్ట్రీలో చాలా మంది కష్టపడి పైకి వచ్చి స్టార్స్ గా మారారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్స్ గా ఎదిగిన వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న స్టార్ కూడా అలా ఎదిగిందే.. ఆమె తండ్రి ఓ స్కూల్ ముందు సమోసాలు అమ్మేవాడు.

తండ్రి సమోసాలు అమ్మేవాడు.. ఇప్పుడు కూతురు కోట్లకు మహారాణి.. స్టార్ సింగర్ ఆమె..
Actress
Rajeev Rayala
|

Updated on: Sep 25, 2025 | 7:51 PM

Share

పై ఫొటోలో కనిపిస్తున్న నటి ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ సింగర్. ఎన్నో క్లాసిక్  పాటలను రీమేక్ చేయడంతో గుర్తింపు తెచ్చుకుంది. అలాగే అనేక సూపర్ హిట్ సాంగ్స్ అద్భుతంగా ఆలపించి శ్రోతల హృదయాలను మైమరపించింది. ఇప్పుడు బుల్లితెరపై పలు సింగింగ్ రియాల్టీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తుంది. సినీ పరిశ్రమలో గాయనిగా కొనసాగుతున్న ఆ బ్యూటీ.. ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. అలాగే పలు షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసింది. కానీ సింగర్ గా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆమెకు సంబంధించిన పర్సనల్ విషయాలు నెట్టింట వైరలవుతుంటాయి. అలాగే చాలాసార్లు ఆమె సింగింగ్ పై విమర్శలు కూడా వచ్చాయి. కానీ అవేం పట్టించుకోకుండా లైఫ్ గడిపేస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..?

ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా సీన్స్ మొత్తం కట్ చేశారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన మమతా మోహన్ దాస్

పై ఫొటోలో కనిపిస్తున్న ఆమె ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ సింగర్ నేహా కక్కర్. నేహా కక్కర్ జూన్ 6, 1988న ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో జన్మించింది. తండ్రి రిషికేశ్ కక్కర్. తల్లి నీతి కక్కర్. సోదరుడు టోనీ కక్కర్ సంగీత దర్శకుడు. సోదరి సోను కక్కర్ సింగర్. ఉత్తరాఖండ్ ప్రాంతానికి చెందిన నేహా కక్కర్.. ఆ తర్వాత కుటుంబంతో కలిసి ఢిల్లీకి మకాం మార్చింది. చిన్న వయసులోనే పాటలు పాడడం ప్రారంభించింది నేహా కక్కర్. చిన్నప్పటి నుంచే అనేక కచేరీలలో పాటలు పడింది. ఆమె సోదరి సోను కక్కర్‌తో కలిసి ఆలయాల్లో భజనలు, కీర్తనలు పాడింది.

ఇవి కూడా చదవండి

బెస్ట్ ఫ్రెండ్ భర్తనే వలలో వేసుకున్న స్టార్ హీరోయిన్.. కట్ చేస్తే అతనితో..

చిన్నవయసులోనే నేహా కక్కర్ కుటుంబం ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంది. ఆమె తండ్రి రిషికేశ్‏లో తన సోదరి చదివిన పాఠశాల ముందు సమోసాలు అమ్మేవాడని గతంలో నేహా కక్కర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నేహా ఆస్తుల విలువ రూ . 65కోట్లకు పైగానే ఉన్నాయని తెలుస్తుంది. నేహా కక్కర్ 2005 సంవత్సరంలో ‘ఇండియన్ ఐడల్’ సీజన్ 2 షోతో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత, ఆమె అనేక బాలీవుడ్ పాటలు పాడింది. ప్రస్తుతం బీటౌన్ ఇండస్ట్రీలో టాప్ సింగర్ గా స్థానం సంపాదించుకుంది. నేహా కక్కర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఫోటోలు, వీడియోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు.

చేసింది రెండు సినిమాలు.. రెండూ యావరేజ్..! అయినా తగ్గని క్రేజ్.. చూస్తే ప్రేమలో పడిపోవాల్సిందే

View this post on Instagram

A post shared by Neha Kakkar (@nehakakkar)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!
ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!
మోమోస్, నూడుల్స్ ప్రసాదంగా ఇచ్చే కాళీ ఆలయం.. ఈ దేవాలయం విశేషాలు..
మోమోస్, నూడుల్స్ ప్రసాదంగా ఇచ్చే కాళీ ఆలయం.. ఈ దేవాలయం విశేషాలు..
రేవంత్‌ అండ్ కిషన్‌..! సింగిల్ ఫ్రేమ్‌... డబుల్ ఎజెండా?
రేవంత్‌ అండ్ కిషన్‌..! సింగిల్ ఫ్రేమ్‌... డబుల్ ఎజెండా?
జూలైలో శక్తివంతమైన వ్యతీపాత యోగం.. ఈ 4 రాశుల వారికి ధనలాభం, విజయం
జూలైలో శక్తివంతమైన వ్యతీపాత యోగం.. ఈ 4 రాశుల వారికి ధనలాభం, విజయం