AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హీరోయిన్‌గా ఇండస్ట్రీని ఊపేసింది.. నాగార్జున మాత్రం రిజెక్ట్ చేశాడు.. ఆమె ఎవరో తెలుసా.?

సినిమా ఇండస్ట్రీలో హీరోలకు వయసుతో సంబంధముండదు. కానీ హీరోయిన్లకు మాత్రం కచ్చితంగా ఏజ్ తో సంబంధముంటుంది. అందుకే హీరోలతో పోల్చుకుంటే ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువగా ఉంటుంది. వరుసగా ఒకటి రెండు ఫ్లాపులు పడితే చాలా చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోతుంటారు.

హీరోయిన్‌గా ఇండస్ట్రీని ఊపేసింది.. నాగార్జున మాత్రం రిజెక్ట్ చేశాడు.. ఆమె ఎవరో తెలుసా.?
Nagarjuna Akkineni
Rajeev Rayala
|

Updated on: Sep 25, 2025 | 8:15 PM

Share

టాలీవుడ్ కింగ్ నాగార్జునకు ఇండియా వైడ్ గా ఉన్న ఫ్యాన్స్ గురించి, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగేశ్వరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగార్జున.. హీరోగా ప్రత్యేక స్థాయిని సొంతం చేసుకున్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు నాగ్. తెలుగు రాష్ట్రాల్లో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న హీరోల్లో మొదటి వరసలో నాగార్జున ఉంటారు. మన్మధుడు నాగార్జున ఎంతో మంది హీరోయిన్స్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సీనియర్ హీరోయిన్స్ దగ్గర నుంచి ఇప్పటి జనరేషన్ యంగ్ హీరోయిన్స్ తో కూడా నాగ్ నటించారు. సీనియర్ హీరోయిన్స్ రమ్యకృష్ణ, సౌందర్య, రోజా, మీనా, శ్రియా, ఆర్తి అగర్వాల్, అనుష్క, స్నేహ, నయనతార వంటి స్టార్స్ అందరూ నాగార్జునతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నవారే అలాగే రకుల్, ఆషిక రంగనాథ్ లాంటి యంగ్ హీరోయిన్స్ తో కూడా రొమాన్స్ చేశారు నాగార్జున.

ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా సీన్స్ మొత్తం కట్ చేశారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన మమతా మోహన్ దాస్

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో సూపర్ హిట్స్ అందుకుని టాప్ హీరోయిన్లుగా కొనసాగుతున్న ముద్దుగుమ్మలందరూ నాగార్జునతో నటించినవారే. కానీ హీరోయిన్ మాత్రం నాగార్జునతో ఒక్క సినిమా కూడా చేయలేదు. అలాగని ఆమె చిన్న హీరోయిన్ కాదు.. ఇండస్ట్రీని ఊపేసిన భామ ఆమె.. స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. కానీ నాగార్జునతో ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..? నాగార్జునతో ఒక్క సినిమా కూడా చేయని టాప్ హీరోయిన్ మరెవరో కాదు.. ఒకప్పటి అందాల రాశి రంభ. 16 ఏళ్లకే కథానాయికగా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. తక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకుంది. రాజేంద్ర ప్రసాద్ ఆ ఒక్కటీ అడక్కు సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ, రజినీకాంత్ జేడీ చక్రవర్తి వంటి స్టార్ హీరోలతో అనేక చిత్రాల్లో నటించింది. అంతేకాదు..అప్పట్లోనే గ్లామర్ రోల్స్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేసింది ఈ వయ్యారి భామ.

బెస్ట్ ఫ్రెండ్ భర్తనే వలలో వేసుకున్న స్టార్ హీరోయిన్.. కట్ చేస్తే అతనితో..

అప్పట్లో విపరీతమైన క్రేజ్ ఉన్న రంభ.. నాగార్జునతో మాత్రం ఒక్క సినిమా చేయలేదు. అయితే నాగార్జునతో సినిమా ఆఫర్స్ వచ్చినప్పటికీ రంభ రిజెక్ట్ చేసిందని టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే.. అప్పట్లో నాగ్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో హలో బ్రదర్ ఒకటి. డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగ్ డ్యూయర్ రోల్ చేశారు. ఇందులో రమ్యకృష్ణ, సౌందర్య హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ చిత్రంలో రమ్యకృష్ణ కంటే ముందుగా రంభను ఎంపిక చేసుకున్నారట డైరెక్టర్. రంభను కన్ఫార్మ్ చేసి డైట్స్ కూడా బుక్ చేశారట. కానీ నాగార్జున రమ్యకృష్మ కావాలని పట్టుబట్టడంతో రంభను తొలగించి ఆమెను తీసుకున్నారట. దీంతో ఆ తర్వాత నాగ్ పక్కన నటించే ఛాన్స్ వచ్చినప్పటికీ రంభ రిజెక్ట్ చేసిందట. కానీ డైరెక్టర్ ఈవీవీ కోరిక మేరకు హలో బ్రదర్ సినిమాలో ఓ పాటలో మెరిసింది రంభ. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న రంభ త్వరలోనే రీ ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తుంది.

చేసింది రెండు సినిమాలు.. రెండూ యావరేజ్..! అయినా తగ్గని క్రేజ్.. చూస్తే ప్రేమలో పడిపోవాల్సిందే

View this post on Instagram

A post shared by Rambha💕 (@rambhaindran_)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us