AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telusu Kada : సిద్దుకి సినిమా అంటే పిచ్చి.. ఈ మూవీ చూసి టిల్లును మర్చిపోతారు.. రాశీ ఖన్నా..

సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న లేటేస్ట్ మూవీ తెలుసు కదా. ఇందులో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తుండగా.. ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించగా.. అక్టోబర్ 17న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

Telusu Kada : సిద్దుకి సినిమా అంటే పిచ్చి.. ఈ మూవీ చూసి టిల్లును మర్చిపోతారు.. రాశీ ఖన్నా..
Raashi Khanna
Rajitha Chanti
|

Updated on: Oct 15, 2025 | 10:11 PM

Share

సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలలో నటిస్తున్న సినిమా తెలుసు కదా. నీరజా కోన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 17న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో హీరోయిన్ శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఇది చాలా స్పెషల్ ఫిలిం. నాకు కథ చాలా నచ్చింది. ఇందులో రాగానే క్యారెక్టర్ లో కనిపిస్తాను. నీరజ అద్భుతంగా రాసింది. నీరజ గారి విజన్ మీ అందరికీ నచ్చుతుంది. తన నుంచి మరిన్ని మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. జ్ఞాన శేఖర్ గారు సినిమాని అద్భుతంగా విజువలైజ్ చేశారు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. మా ప్రొడ్యూసర్స్ విశ్వ గారికి కృతి గారికి థాంక్యూ. ఈ సినిమాకి వాళ్ళు బ్యాక్ బోన్. తమన్ గారు అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు రాశిఖన్నాతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంజలి క్యారెక్టర్ ని అద్భుతంగా పెర్ఫాం చేసింది. సిద్దు గారి జర్నీ ఇన్స్పిరేషన్. తను వండర్ఫుల్ కోస్టర్. తనతో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. అక్టోబర్ 17న సినిమా థియేటర్స్ లో చూడండి తప్పకుండా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది.

హీరోయిన్ రాశి ఖన్నా మాట్లాడుతూ… తెలుసు కదా నా మనసుకు చాలా దగ్గర సినిమా. చాలా కష్టపడ్డాం. ఇంత అద్భుతమైన క్యారెక్టర్ చేసిన రాసినందుకు నీరజాకి థాంక్యూ. జ్ఞాన్ శేఖర్ గారు ప్రతి ఫ్రేమ్ ని ఒక పెయింటింగ్ లాగా తీశారు. తమన్ గారు హిట్ ఆల్బమ్ ఇచ్చారు. సిద్దు హర్ష శ్రీనిధి నన్ను అందరిని ఒక కొత్త కోణంలో చూస్తారు. శ్రీనిధి చాలా కష్టపడింది. తన బ్యూటిఫుల్ సోల్. తనతో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. సిద్దుకి సినిమా అంటే పిచ్చి. అంత ఫ్యాక్షన్ ఉన్న కోస్టార్ ని నేను ఎప్పుడు చూడలేదు. ఈ సినిమా చూసిన తర్వాత మీరు టిల్లును కూడా మర్చిపోతారు. అక్టోబర్ 17న తప్పకుండా ఈ సినిమా అందరూ చూడాలని కోరుకుంటున్నాను.

డైరెక్టర్ నీరజకోన మాట్లాడుతూ.. విశ్వ గారికి కృతికి థాంక్యూ సో మచ్ ఫస్ట్ టైం డైరెక్టర్ కి వాళ్ళు ఇచ్చిన సపోర్టు మర్చిపోలేను ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి కారణం మా నిర్మాతలే సిద్దు లేకుండా ఈ సినిమా ఉండేది కాదు ఈ సినిమాకి తను బ్యాక్ బోన్ నిధి రాశికి థాంక్యూ వాళ్ళిద్దరూ ఈ ప్రాజెక్టుకి రావడం అదృష్టంగా భావిస్తున్నాను ఈ ముగ్గురు సినిమాకి పిల్లర్స్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు హర్ష క్యారెక్టర్ మీ అందరిని అలరిస్తుంది జ్ఞాన శేఖర్ గారు అద్భుతంగా విజువల్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తమన్ మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్ అసెట్ రెండు పాటలు పెద్ద హిట్ అయ్యాయి బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంటుంది మేం తీసిన సినిమాని మాకు కొత్తగా చూపించింది ఎడిటర్ నవీన్ ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

ఇవి కూడా చదవండి : Cinema: రిషబ్ శెట్టి కాంతారా వెనక్కు నెట్టిన సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..

నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?