Tollywood : 16 ఏళ్లకే టాప్ హీరోయిన్.. ఇండస్ట్రీలో చక్రం తిప్పి.. 19 ఏళ్ల వయసులో మరణం..
అందమైన రూపం.. ఆకర్షణీయమైన స్ర్కీన్ ప్రెజన్స్.. 16 ఏళ్ల వయసులోనే టాప్ హీరోయిన్ అయ్యింది. ఒక్క ఏడాదిలోనే మెగాస్టార్ చిరంజీవి, ప్రశాంత్, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే బాలీవుడ్ నిర్మాతను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లైన ఏడాదికే అనుహ్యంగా మరణించింది.

సినీప్రియుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. 16 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలో చక్రం తిప్పిన ఓ ముద్దుగుమ్మ.. అనుహ్యంగా 19 ఏళ్ల వయసులోనే కన్నుమూసింది. అప్పట్లో ఆమె మరణం ఇండస్ట్రీని కుదిపేసింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ దివ్య భారతి. ఆమె మరణం అభిమానులు ఇప్పటికీ నమ్మలేని విషాదం. దాదాపు పది చిత్రాల్లో నటించిన హీరోయిన్.. ఒక్క సంవత్సరంలోనే ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. అప్పట్లో ఆమె అత్యధిక పారితోషికం తీసుకునే నటి ఆమె. కానీ దివ్య భారతి 19 సంవత్సరాల వయసులో మరణించి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ మరణం చుట్టూ ఇప్పటికీ వీడని అనుమానాలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి : Cinema: రిషబ్ శెట్టి కాంతారా వెనక్కు నెట్టిన సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
దివ్య భారతి 1990లో 16 ఏళ్ల వయసులో ‘నీలా పెన్నే’ అనే తమిళ చిత్రంతో నటనా రంగ ప్రవేశం చేసింది. తొలి సినిమా విఫలమైంది. కానీ ఆ తర్వాత 1990లో వెంకటేశ్ సరసన బొబ్బిలి రాజా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీ అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఆమె పేరు మారుమోగింది. అప్పట్లో ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన దివ్య భారతి.. 1992లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘విశ్వాత్మ’తో హిందీ సినిమాల్లోకి అడుగుపెట్టింది. 1992లో వచ్చిన యాక్షన్-కామెడీ చిత్రం ‘షోలా ఔర్ షబ్నం’ ఆమె కెరీర్ మలుపు తిప్పింది.
అదే సంవత్సరం, ఆమె షారుఖ్ ఖాన్ సరసన ‘దీవానా’ చిత్రంలో నటించింది, ఈ చిత్రం ఆమెకు ఉత్తమ తొలి నటిగా ఫిలింఫేర్ అవార్డును అందుకుంది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఆమె బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియవాలాను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత అతడితో కలిసి ముంబైకు షిఫ్ట్ అయ్యింది. 1993 ఏప్రిల్ 5న ముంబైలోని తన ఐదవ అంతస్తు అపార్ట్‌మెంట్ బాల్కనీ నుంచి పడి దివ్య మరణించింది. ఆమె మరణం చుట్టూ ఎన్నో అనుమానాలు తలెత్తాయి. 1992, 1993 వరకు ఒక్క ఏడాదిలోనే 14 సినిమాల్లో నటించింది. దివ్య చివరి చిత్రం ‘షత్రంజ్’, ఇది డిసెంబర్ 1993లో మరణానంతరం విడుదలైంది. దివ్య భారతి నిర్మాత సాజిద్ నదియాద్వాలాను రహస్యంగా వివాహం చేసుకున్నారు.

Divya Bharti Movies
ఇవి కూడా చదవండి : Baby Movie: అమ్మడు నువ్వేనా ఇలా.. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..
