ఆ భయంతోనే స్టార్ హీరో సినిమా ఛాన్స్ మిస్ చేసుకున్నా.. ఐశ్వర్య లక్ష్మీ
Rajitha Chanti
Pic credit - Instagram
09 September 2026
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం కింగ్ ఆఫ్ కోతా. హైప్‌తో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయింది.
ఐశ్వర్య లక్ష్మీ
అంతేకాకుండా, ఈ సినిమా విడుదలైన తర్వాత నెట్టింట తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ ఎదుర్కొంది. దీనిపై ఐశ్వర్య లక్ష్మి పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఐశ్వర్య లక్ష్మీ
ఈ సినిమా పరాజయం, ఆ తర్వాత వచ్చిన నెగెటివిటీ తన కెరీర్‌ను తీవ్రంగా ప్రభావితం చేశాయని ఐశ్వర్య తెలిపారు. ఆమె చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.
ఐశ్వర్య లక్ష్మీ
ఈ మూవీ డిజాస్టర్ తర్వాత మలయాళ చిత్ర పరిశ్రమలో దర్శకులకు , నిర్మాతలకు తనను సినిమాల్లోకి తీసుకోవాలంటే ఒకవిధమైన భయం లేదా సంకోచం ఏర్పడిందని ఆమె పేర్కొన్నారు.
ఐశ్వర్య లక్ష్మీ
తన నటన, డైలాగ్ డెలివరీలపై వచ్చిన ట్రోల్స్ చూసి ఒకానొక సమయంలో 'వారు చెబుతున్నది నిజమేనేమో' అని తనకూ అనిపించిందని అన్నారు.
ఐశ్వర్య లక్ష్మీ
సినిమాలో దుల్కర్ సల్మాన్ పాత్రను ఉద్దేశించి ఐశ్వర్య చెప్పిన ‘రాజువెట్టా’ అనే సంభాషణ నెట్టింట బాగా వైరల్ అయి ట్రోలింగ్‌కు గురైంది.
ఐశ్వర్య లక్ష్మీ
ఈ నెగెటివిటీ షూటింగ్ సెట్లలోనూ తనను వెంటాడిందని ఆమె తెలిపారు. 'హలో మమ్మీ' అనే చిత్రం షూటింగ్ సమయంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తనను పిలిచి వెక్కించారని అన్నారు.
ఐశ్వర్య లక్ష్మీ
దుల్కర్ సల్మాన్‌తో కలిసి ఒక కమర్షియల్ యాడ్‌లో నటించే అవకాశం వచ్చినప్పటికీ, ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలిపారు. ఆమె కామెంట్స్ వైరల్ గా మారాయి.