సింపుల్‌గా.. చీరకట్టులో ఆకట్టుకుంటున్న వైష్ణవి చైతన్య

samatha

09 september 2026

Pic credit - Pinterest

బ్యూటీ వైష్ణవి చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.

ఈ అమ్మడు వెబ్ సిరీస్‌ల ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకొని, ఏకంగా సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చింది.

యూట్యూబ్ రీల్స్, షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ, బేబీ మూవీతో తెలుగు వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది.

మొదటి సినిమాతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకొని, స్టార్ హీరోయిన్స్ లా మంచి ఫేమ్ సంపాదించుకుంది.

అంతే కాకుండా మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత కూడా ఈ చిన్నది పలు సినిమాల్లో నటించి మెప్పించింది.

హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వకముందు ఈ బ్యూటీ అలా వైకుంఠపురం వంటి పెద్ద స్టార్ సినిమాల్లో పలు పాత్రల్లో మెరిచింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ మరోసారి ఆనంద్ దేవరకొండ సరసన ఎపిక్ మూవీలో నటించింది. ఇక ఈ మూవీతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా  చీరకట్టులో తన అందంతో ఆకట్టుకుంటుంది.