AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లండన్ ఉద్యోగ వీసా స్కామ్‌‌లో కొత్త ట్విస్ట్.. నందన అరెస్ట్‌తో వెలుగులోకి అస్సలు యవ్వారం!

యూట్యూబర్ నందన లండన్ ఉద్యోగాల పేరుతో మోసం చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు. బాధితుల నుంచి వీసా, వర్క్ పర్మిట్ కోసం లక్షలు వసూలు చేసి మోసం చేశారన్న కేసులో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడ్డారు. నందన, ఆమె భర్తపై లుక్ అవుట్ నోటీసులు ఉండగా, ఈ అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

లండన్ ఉద్యోగ వీసా స్కామ్‌‌లో కొత్త ట్విస్ట్.. నందన అరెస్ట్‌తో వెలుగులోకి అస్సలు యవ్వారం!
Youtuber Nandana Fraud
Balaraju Goud
|

Updated on: Sep 09, 2026 | 10:02 PM

Share

యూట్యూబర్ నందనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ న్యూస్ వినగానే ఆమె ఛానల్‌ను ఫాలో అయ్యేవారు, ఆమె గురించి తెలిసినవారు షాకై ఉండొచ్చు. కానీ లండన్‌లో ఉద్యోగాల పేరుతో ఆమె మోసం చేసిందని ఆరోపిస్తున్న వారంతా.. ఇప్పటికైనా తమకు న్యాయం జరుగుతుందని సంతోషపడి ఉండొచ్చు. నందనపై విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నంలో పోలీస్ కేసు నమోదు కావడంతో తెలుగు ప్రేక్షకుల ఫోకస్ అంతా ఆమె పై పడింది. అసలేమిటీ కేసు.. నందనను ఇప్పుడు అరెస్ట్ చేసే వరకు ఏం జరిగింది అని ఆరా తీస్తున్నారు. ఎందుకంటే.. హస్కీ వాయిస్ తో ఆమె తన ఫ్యామిలీతో కలిసి చేసే వీడియోలు యూట్యూబ్ వ్యూయ‌ర్స్‌కు కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఇస్తాయి. అందుకే ఆమెకు ఫ్యాన్ బేస్ ఉంది. కానీ కాయిన్‌కు ఇటువైపు ఉద్యోగాల పేరుతో మోసం చేశారన్న ఆరోపణలు రావడంతో అసలేం జరిగిందా అని చర్చించుకుంటున్నారు. నందనను అరెస్ట్ చేయడానికి కారణమేంటి? పోలీసులు ఎప్పుడు, ఎక్కడ, ఎలా అదుపులోకి తీసుకున్నారు? నెక్స్ట్ ఏం జరగనుంది? నందన.. ఆయన భర్తపై వీసా స్కామ్ కు సంబంధించి ఆరోపణలు ఉన్నాయి. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో నందన దంపతులపై కేసులున్నాయి. అందుకే లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. దీంతో ఆమె శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవ్వగానే ఇమ్మిగ్రేషన్ అధికారులు నందనను గుర్తించారు. వెంటనే అరెస్ట్ చేశారు. లండన్‌లో జాబ్స్ ఇప్పిస్తామని.. వీసా రెన్యువల్ చేయిస్తామని.. సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ వచ్చేలా...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి