AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: అక్షరాలా 5000.. మరో బిడ్డకు ప్రాణం పోసిన మహేష్ .. మీ సాయం ఇలాగే కొనసాగాలి సార్..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలు చేయకున్నా ఈ తెలుగు స్టార్ హీరోకు నేషనల్ వైడ్ గా గుర్తింపు ఉంది. కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు.

Mahesh Babu: అక్షరాలా 5000.. మరో బిడ్డకు ప్రాణం పోసిన మహేష్ .. మీ సాయం ఇలాగే కొనసాగాలి సార్..
Mahesh Babu
Basha Shek
|

Updated on: Oct 17, 2025 | 6:35 PM

Share

ఇండియాలో ది మోస్ట్ హ్యాండ్సమ్ హీరోల్లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. 50కు చేరవవుతోన్నా 20 ఏళ్ల కుర్రాడిలా కనిపించే ఈ హీరో అంటే అమ్మాయిలు పడి చస్తారు. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. సుమారు 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మహేష్ తో రొమాన్స్ చేయనుంది. సినిమాల సంగతి పక్కన పెడితే మహేష్ కు కోట్లాది మంది అభిమానులుండడానికి కారణం కేవలం సినిమాలే కాదు. ఆయన చేస్తోన్న సామాజిక సేవా కార్యక్రమాలు కూడా. మహేష్ బాబు ఫౌండేషన్ పేరుతో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నాడీ సూపర్ స్టార్. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది చిన్న పిల్లలకు ఉచితంగా చేస్తోన్న గుండె ఆపరేషన్ల గురించి. తన కుమారుడు గౌతమ్ పుట్టినప్పుడు కొన్ని అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయి. హార్ట్ ప్రాబ్లమ్ ఉండడంతో సర్జరీ చేయించాడు. ఈ ఘటనే ఓ గొప్ప మంచి పనికి పునాది అయ్యింది. తన కుమారుడిలా మరొక పిల్లాడికి అలాంటి సమస్యలు రాకూడదని తలంపుతో గుండె జబ్బులు ఉన్న చిన్నారులకు ఉచితంగా వైద్యం చేయించాలని నిర్ణయించుకున్నాడు. అలా ఇప్పటివరకు వేల మంది చిన్నారులకు ఉచితంగా హార్ద్ సర్జరీలు చేయించాడీ రియల్ హీరో. తద్వారా వారి తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం నింపాడు.

ఇదిలా ఉంటే నేటితో మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొత్తం 5000 ఉచిత హార్ట్ సర్జరీలు పూర్తయ్యాయట. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో మహేష్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. నువ్వు దేవుడివి సామీ.. నీ సాయం ఇలాగే కొనసాగని అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక సినిమాల విషయానికి వస్తే.. గతేడాది సంక్రాంతికి గుంటూరు కారం మూవీతో అభిమానుల ముందుకు వచ్చాడు మహేష్. ఆ తర్వాత తన పాత సినిమా రీ రిలీజ్ లతోనే మన ముందుకు వచ్చాడు. ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా భాగం పూర్తైంది. త్వరలోనే ఈ మూవీ నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.