AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. కట్ చేస్తే.. హీరోయిన్‏గా నేషనల్ అవార్డ్.. పెళ్లి తర్వాత తగ్గని క్రేజ్..

చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి.. అమాయకమైన నటనతో కట్టిపడేసింది. తక్కువ సమయంలోనే హీరోయిన్ గానూ సత్తా చాటింది. కట్ చేస్తే.. తెలుగులో రెండో సినిమాకే ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈరోజు ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీతారలు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇంతకీ ఆమె ఎవరో మీకు తెలుసా.. ?

Tollywood : చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. కట్ చేస్తే.. హీరోయిన్‏గా నేషనల్ అవార్డ్.. పెళ్లి తర్వాత తగ్గని క్రేజ్..
Keerthy Suresh Childhood
Rajitha Chanti
|

Updated on: Oct 17, 2025 | 6:05 PM

Share

తెలుగు సినీప్రియులకు ఇష్టమైన హీరోయిన్. చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు హీరోయిన్ గా తనదైన ముద్ర వేసింది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అలరించింది. ఆమె మరెవరో కాదండి. హీరోయిన్ కీర్తి సురేష్. కేరళలోని తిరువనంతపురంలో అక్టోబర్ 17, 1992న జన్మించిన ఈ ముద్దుగుమ్మ.. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి పెంచుకుంది. ఆమె తండ్రి దర్శకుడు జి. సురేష్ కుమార్, తల్లి ఒకప్పటి హీరోయిన్ మేనక. ఫిల్మ్ బ్యాగ్రౌండ్ ఫ్యామిలీ కావడంతో సులభంగానే తెరంగేట్రం చేసింది. . చెన్నైలోని పెర్ల్ అకాడమీ నుండి ఫ్యాషన్ డిజైనింగ్‌లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన కీర్తి.. తన తండ్రి నిర్మించిన పైలట్స్, అచనేయనేనిక్కిష్టం, కుబేరన్ వంటి చిత్రాలలో బాలనటిగా నటించింది. ఆ తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండి చదువుపై శ్రద్ధ పెట్టింది.

ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, కమల్ హాసన్‏తో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు విదేశాల్లో వ్యాపారాలు.. ఈ బ్యూటీ క్రేజ్ వేరప్పా..

2013లో గీతాంజలి అనే సినిమాతో హీరోయిన్ గా మలయాళీ చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ సినిమాతోనే ఉత్తమ మహిళా అరంగేట్రం కథానాయికగా సైమా అవార్డ్ అందుకుంది. 2015 నాటికి కీర్తి తెలుగు, తమిళం, మలయాళం భాషలలో పలు చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా తెలుగులో మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో ఒదిగిపోయింది. ఈ సినిమాలో తన నటనకు ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్ అందుకుంది. ఈ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో మరిన్ని ఆఫర్స్ క్యూ కట్టాయి. 2019 నుంచి 2024 వరకు అనేక చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసింది.

ఇవి కూడా చదవండి : Serial Actress: అబ్బబ్బో.. అదరగొట్టేస్తోన్న రుద్రాణి అత్త.. నెట్టింట గ్లామర్ గత్తరలేపుతున్న సీరియల్ విలన్..

తెలుగుతోపాటు హిందీలోకి తెరంగేట్రం చేసింది. కానీ హిందీలో ఆమెకు ఊహించినంత స్థాయిలో సక్సెస్ రాలేదు. 2024 డిసెంబర్ లో తన చిరకాల స్నేహితుడు ఆంటోని థాటిల్ ను వివాహం చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. వీరిద్దరి వివాహం గోవాలో మలయాళీ, క్రైస్తవ సంప్రదాయాల్లో జరిగింది. ప్రస్తుతం కీర్తి సురేష్.. విజయ్ దేవరకొండ సరసన రౌడీ జనార్దన్ సినిమాలో నటిస్తుంది.

ఇవి కూడా చదవండి : 43 ఏళ్ల వయసులో ఇంత స్లిమ్‏గా.. ఈ హీరోయిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..