హీరో టు జీరో.. పెళ్లై, పిల్లలున్నా నటితో ప్రేమాయణం.. చివరకు కటకటాల పాలు.. దర్శన్, పవిత్రల ఫుల్ స్టోరీ

కన్నడ స్టార్ హీరో, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ ఓ హత్య కేసులో అరెస్ట్ అయ్యాడు. దర్శన్ తో పాటు ఆయన ప్రియురాలిగా పరిచయమున్న ప్రముఖ నటి పవిత్ర గౌడను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 13 మందిని ఈ హత్య కేసులో నిందితులుగా చేర్చారు కర్ణాటక పోలీసులు. ఈ వార్త కన్నడ సినీ పరిశ్రమనే కాకుండా యావత్ భారత సినిమా ఇండస్ట్రీని షాక్ కు గురి చేసింది

హీరో టు జీరో.. పెళ్లై, పిల్లలున్నా నటితో ప్రేమాయణం.. చివరకు కటకటాల పాలు.. దర్శన్, పవిత్రల ఫుల్ స్టోరీ
Darshan, Pavithra Gowda
Follow us

|

Updated on: Jun 11, 2024 | 5:12 PM

కన్నడ స్టార్ హీరో, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ ఓ హత్య కేసులో అరెస్ట్ అయ్యాడు. దర్శన్ తో పాటు ఆయన ప్రియురాలిగా పరిచయమున్న ప్రముఖ నటి పవిత్ర గౌడను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 13 మందిని ఈ హత్య కేసులో నిందితులుగా చేర్చారు కర్ణాటక పోలీసులు. ఈ వార్త కన్నడ సినీ పరిశ్రమనే కాకుండా యావత్ భారత సినిమా ఇండస్ట్రీని షాక్ కు గురి చేసింది. దర్శన్ పేరుకు కన్నడ హీరో అయినప్పటికీ ఇతర భాషల్లోనూ ఆయన సినిమాలు రిలీజవుతుంటాయి. గతేడాది ప్రభాస్ సలార్ కు పోటీగా రిలీజైన కాటేరా మూవీ తెలుగుతో సహా పలు భాషల్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. స్టార్ హీరో అంటే అభిమానులకు ఆదర్శంగా ఉండాలి. కానీ దర్శన్ మాత్రం ప్రియురాలి మోజులో పడి కటకటాల పాలయ్యాడు. పెళ్లై, పిల్లలున్నా పవిత్ర గౌడ్ తో ప్రేమాయాణం జరిపి చివరకు ఓ వ్యక్తిని హత్య చేయాల్సి వచ్చింది. అది కూడా తనను అమితంగా ఆరాధించే అభిమానినే. పూర్తి వివరాల్లోకి వెళితే..

నిత్యం వివాదాల్లో..

కన్నడ నాట స్టార్ హీరోగా వెలుగొందుతోన్న దర్శన్ 2003లో విజయలక్ష్మీ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరికి వినీష్ అనే బాబు కూడా ఉన్నాడు. అయితే సినిమాలతో పాటు వివాదాలతోనూ వార్తల్లో నిలుస్తుంటాడు దర్శన్. మరీ ముఖ్యంగా డేటింగ్, రిలేషన్ షిప్ విషయాల్లో ఇతని పేరు ప్రముఖంగా వినిపిస్తుంటుంది. గతంలో తెలుగు హీరోయిన్ నిఖితతో ప్రేమాయణం సాగించాడని ప్రచారం జరిగింది. అయితే భార్య వార్నింగ్ ఇవ్వడంతో నిఖితతో ప్రేమాయణం కట్ చేశాడని తెలిసింది. ఇక 2011లో స్వయంగా దర్శన్ భార్యనే సదరు హీరోపై గృహ హింస కేసు పెట్టింది. ఈ కారణంగా 14 రోజుల పాటు జైలు జీవితం కూడా గడిపాడు దర్శన్.

భర్తకు విడాకులిచ్చి..

ఇక పవిత్ర విషయానికి వస్తే.. 2013లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆమెకు గతంలో సంజయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి ఖుషి అనే కూతురు కూడా ఉంది. అయితే భర్తకు విడాకులిచ్చి దర్శన్‌ తో ప్రేమాయణం సాగించింది. దర్శన్ తో తన రిలేషన్ పూర్తయ్యి ఈ ఏడాది జనవరిలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి కలకలం రేపిందీ అందాల తార. పవిత్ర కారణంగానే దర్శన్ కాపురంలో కలహాలు మొదలయ్యాయని కన్నడ నాట టాక్. అంతకు ముందు కూడా పలు సార్లు దర్శన్ తో కలిసి దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది పవిత్ర. అయితే అభిమానులు వార్నింగ్ ఇవ్వడంతో వెనక్కు తగ్గింది.

ఇవి కూడా చదవండి

అభిమానినే హత్య చేసే స్థాయికి దిగజారి

అయితే ఇటీవల పవిత్ర గౌడ.. తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా దర్శన్‌తో ఉన్న ఫోటోను నెట్టింట షేర్ చేసింది. తామిద్దరం పదేళ్ల నుండి రిలేషన్ షిప్‌లో ఉన్నామని, దర్శన్ భార్య విజయలక్ష్మికీ తమ ప్రేమ బంధం గురించి తెలుసంటూ పెద్ద దుమారమే రేపింది. అప్పుడే వీరి జీవితంలోకి రేణుక స్వామి ఎంటరయ్యాడు. దర్శన్ కు వీరాభిమాని అయిన అతను తన ఫేవరెట్ హీరో భార్యకు అన్యాయం చేయడం సరికాదంటూ బహిరంగంగా కామెంట్స్ చేశాడు. నటి పవిత్ర వ్యవహార శైలిని తప్పుపట్టాడు. సోషల్ మీడియా వేదికగా నటికి బెదిరింపు సందేశాలు కూడా పంపినట్లు తెలుస్తోంది. అయితే అనూహ్యంగా రేణుకస్వామి దారుణ హత్యకు గురయ్యాడు. కామాక్షి పాళ్యలోని ఓ అపార్ట్ మెంట్ సమీపంలోని డ్రైనేజీలో మృతదేహం లభించింది. పవిత్రకు అసభ్యకరమైన సందేశాలు పంపుతుండటంతోనే తట్టుకోలేక దర్శన్ రేణకు స్వామిని హత్య చేసి డ్రైనేజీలో పడేశాడని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో హీరో దర్శన్, అతని ప్రియురాలు పవిత్రతో సహా మొత్తం 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మొత్తానికి అభిమానులకు ఆదర్శంగా నిలవాల్సిన హీరో ప్రియురాలి మోజులో భార్య, పిల్లలను గాలికొదిలేశాడు. ఏకంగా హత్య కేసులో ఇరుక్కుని కటాకటాల పాలయ్యాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles