Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఒక్క సినిమాతో తెలుగు కుర్రాళ్ల మతిపోగొట్టిన హీరోయిన్.. ఇన్నాళ్లకు రీఎంట్రీ.. ఎవరో గుర్తుపట్టారా..?

మలయాళంలో అనేక చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ.. తెలుగులో మాత్రం ఒకే ఒక్క సినిమాతో క్లిక్ అయ్యింది. అందం, అభినయంతో ఒకప్పుడు తెలుగు కుర్రాళ్లను కట్టిపడేసింది. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉంటుందనుకున్న హీరోయిన్ జీవితం ఊహించని మలుపులు తిప్పింది. కిడ్నాప్, లైంగిక దాడి ఆమె కెరీర్‏ను నాశనం చేశాయి.

Tollywood: ఒక్క సినిమాతో తెలుగు కుర్రాళ్ల మతిపోగొట్టిన హీరోయిన్.. ఇన్నాళ్లకు రీఎంట్రీ.. ఎవరో గుర్తుపట్టారా..?
Actress
Rajitha Chanti
|

Updated on: Jun 11, 2024 | 5:05 PM

Share

సినీ రంగుల ప్రపంచంలో గుర్తింపు రావడం చాలా కష్టం. ఎన్నో కష్టాలు.. అడ్డంకులను దాటుకుని ఒక ఫేమ్ తెచ్చుకోవాలని ఎంతో మంది కలలు కంటారు. కానీ ఇక్కడ అందం, టాలెంట్ మాత్రమే కాదు..కాసింత అదృష్టాన్ని కూడా వెంట తెచ్చుకోవాల్సిందే. స్టార్ హీరోస్ విషయం పక్కన పెడితే హీరోయిన్స్ విషయంలో లక్ కచ్చితంగా ఉండాల్సిందే. ఒక్క సినిమాతోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నా.. ఆ తర్వాత ఊహించని కారణాలతో ఇండస్ట్రీకి దూరమైపోతుంటారు. తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న తారలు ఆ తర్వాత మాత్రం కంటికి కనిపించారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు. మలయాళంలో అనేక చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ.. తెలుగులో మాత్రం ఒకే ఒక్క సినిమాతో క్లిక్ అయ్యింది. అందం, అభినయంతో ఒకప్పుడు తెలుగు కుర్రాళ్లను కట్టిపడేసింది. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉంటుందనుకున్న హీరోయిన్ జీవితం ఊహించని మలుపులు తిప్పింది. కిడ్నాప్, లైంగిక దాడి ఆమె కెరీర్‏ను నాశనం చేశాయి. జీవితంలో జరిగిన చేదు ఘటనల తర్వాత కొన్నేళ్లు ఇండస్ట్రీకి దూరమైన ఈ హీరోయిన్ ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. ? తను మరెవరో కాదు.. టాలీవుడ్ హీరోయిన్ భావన.

మలయాళంలో అనేక చిత్రాల్లో నటించిన భావన.. తెలుగులో ఒంటరి, మహాత్మ, జగడం, పగ, హీరో వంటి చిత్రాల్లో నటించింది. టాలెంటెడ్ హీరో శ్రీకాంత్ సరసన నటించిన మహాత్మ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో భావనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇందులో ఈ బ్యూటీ సహజ నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఆ తర్వాత ఆమె నటించిన చిత్రాలు అంతగా క్లిక్ కాలేదు. ఆ తర్వాత ఓ సినిమా షూటింగ్ పూర్తయ్యాక ఇంటికి వెళ్తున్న సమయంలో కొందరు దుండగులు భావను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడ్డారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ కేసులో మలయాళీ నటుడు దిలీప్ ను నిందితుడిగా భావిస్తూ పోలీసులు అరెస్ట్ చేయగా.. కొన్నాళ్ల తర్వాత అతడు బెయిల్ పై బయటకు వచ్చారు.

ఈ ఘటన పై అప్పట్లో భావన స్పందించలేదు. కొన్నాళ్లపాటు సైలెంట్ అయిన భావన.. 2018లో నిర్మాత నవీన్ ను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత చాలా కాలం సినిమాలకు దూరమైన భావన.. ఇటీవలే మలయాళంలో నడికార్ అనే సినిమాలో నటించింది. అలాగే పలు సినిమాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Horoscope Today: ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు వారికి అనుకూల సమయం..
Horoscope Today: ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు వారికి అనుకూల సమయం..
మూడురోజుల్లో నీళ్లు తెస్తామన్నారు.. పదేళ్లైన చుక్క తేలేదు-సీఎం
మూడురోజుల్లో నీళ్లు తెస్తామన్నారు.. పదేళ్లైన చుక్క తేలేదు-సీఎం
గుడ్‌న్యూస్‌.. ఇప్పుడు సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్..సిమ్‌ని ఇలా చేయండి
గుడ్‌న్యూస్‌.. ఇప్పుడు సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్..సిమ్‌ని ఇలా చేయండి
మీకు యూట్యూబ్‌ ఛానల్‌ ఉందా? జూలై 15 నుంచి కొత్త రూల్స్‌..!
మీకు యూట్యూబ్‌ ఛానల్‌ ఉందా? జూలై 15 నుంచి కొత్త రూల్స్‌..!
ఆంధ్రా ప్యారిస్ అందాలు తిలకించేలా బోటు షికార్.... ఎప్పుడంటే..
ఆంధ్రా ప్యారిస్ అందాలు తిలకించేలా బోటు షికార్.... ఎప్పుడంటే..
ఫ్లైట్‌ కిటికీలు గుండ్రంగా ఎందుకు ఉంటాయో తెలుసా..? కారణాలు ఇవే..!
ఫ్లైట్‌ కిటికీలు గుండ్రంగా ఎందుకు ఉంటాయో తెలుసా..? కారణాలు ఇవే..!
5 నిమిషాల్లో 100 శాతం ఛార్జ్.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 3000 కి.మీ
5 నిమిషాల్లో 100 శాతం ఛార్జ్.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 3000 కి.మీ
రెండు రాష్ట్రాల అధికారులను బురిడీ కొట్టించారు.. ఎట్టకేలకు ఏపీలో..
రెండు రాష్ట్రాల అధికారులను బురిడీ కొట్టించారు.. ఎట్టకేలకు ఏపీలో..
విటమిన్ బి12 లోపం మరణానికి దారితీస్తుందా? అది శరీరానికి ఎంత హాని
విటమిన్ బి12 లోపం మరణానికి దారితీస్తుందా? అది శరీరానికి ఎంత హాని
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ఏపీ సర్కార్
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ఏపీ సర్కార్
అమెరికా కీలక పరిశోధన.. ఏఐతో ఆకస్మిక గుండెపోటు మరణాలకు చెక్‌
అమెరికా కీలక పరిశోధన.. ఏఐతో ఆకస్మిక గుండెపోటు మరణాలకు చెక్‌
మూడో బిడ్డను కనండి.. రూ.12 లక్షల రివార్డు అందుకోండి
మూడో బిడ్డను కనండి.. రూ.12 లక్షల రివార్డు అందుకోండి
కుక్కను పెంచుకోవడానికి .. మీ ఇరుగు పొరుగు పర్మిషన్ తప్పనిసరి!
కుక్కను పెంచుకోవడానికి .. మీ ఇరుగు పొరుగు పర్మిషన్ తప్పనిసరి!
గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మి వెళ్తుండగా.. గుంతలో పడ్డ కారు
గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మి వెళ్తుండగా.. గుంతలో పడ్డ కారు
బద్ధలవుతున్న అగ్నిపర్వతం సాక్షిగా.. జంట నిశ్చితార్థం
బద్ధలవుతున్న అగ్నిపర్వతం సాక్షిగా.. జంట నిశ్చితార్థం
ధైర్యమున్నోళ్లే చూడాల్సిన సినిమా.. మనుషుల్ని తినే ఫ్యామిలీ
ధైర్యమున్నోళ్లే చూడాల్సిన సినిమా.. మనుషుల్ని తినే ఫ్యామిలీ
బ్లాక్‌ సాల్ట్‌ వాడి చూడండి.. ఫలితాలు చూస్తే ఆశ్చర్యపోతారు
బ్లాక్‌ సాల్ట్‌ వాడి చూడండి.. ఫలితాలు చూస్తే ఆశ్చర్యపోతారు
స్నేహితుడికి హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి.. మహిళగా మార్చి అత్యాచారం
స్నేహితుడికి హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి.. మహిళగా మార్చి అత్యాచారం
పేలిన రిఫ్రిజిరేటర్‌.. మసిబొగ్గుగా మారిన ఇల్లు..!
పేలిన రిఫ్రిజిరేటర్‌.. మసిబొగ్గుగా మారిన ఇల్లు..!
170 కేజీల బరువు.. జిమ్‌ చేస్తూ కుప్పకూలిపోయాడు
170 కేజీల బరువు.. జిమ్‌ చేస్తూ కుప్పకూలిపోయాడు