- Telugu News Photo Gallery Cinema photos Actor Arjun Sarja's Daughter Aishwarya Arjun Knot Tamil Hero Umapathi in Hanuman Temple Chennai
Aishwarya Arjun Marriage: యంగ్ హీరోతో అర్జున్ సర్జా కూతురి పెళ్లి.. హనుమాన్ ఆలయంలో ఇలా.. ఫోటోస్ వైరల్..
కన్నడ స్టార్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పెద్ద కూతురు ఐశ్వర్య అర్జున్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. కోలీవుడ్ లెజెండరీ నటుడు.. డైరెక్టర్ కమ్ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు.. యంగ్ హీరో ఉమాపతిని వివాహం చేసుకుంది. వీరిద్దరి వివాహం చెన్నైలోని హనుమాన్ ఆలయంలో సంప్రదాయ పద్దతిలో జరిగింది.
Updated on: Jun 11, 2024 | 3:35 PM

కన్నడ స్టార్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పెద్ద కూతురు ఐశ్వర్య అర్జున్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. కోలీవుడ్ లెజెండరీ నటుడు.. డైరెక్టర్ కమ్ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు.. యంగ్ హీరో ఉమాపతిని వివాహం చేసుకుంది.

వీరిద్దరి వివాహం చెన్నైలోని హనుమాన్ ఆలయంలో సంప్రదాయ పద్దతిలో జరిగింది. వీరి పెళ్లి వేడుకకు ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు, స్నేహితులు, పలువురు నటీనటులు హాజరయ్యారు. తాజాగా వీరి పెళ్లి ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ఇదిలా ఉంటే.. ఐశ్వర్య అర్జున్ నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నించింది. కథానాయికగా పలు చిత్రాల్లో నటించినా సక్సెస్ కాలేకపోయింది. తెలుగులోనూ ఓ సినిమా ద్వారా తెరంగేట్రం చేయాలనుకున్న ఐశ్వర్య.. పలు కారణాలతో ఆగిపోయింది.

కూతురి కోసం అర్జున్ దర్శకుడిగా మారి సినిమా తెరకెక్కించిన బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయింది. ఐశ్వర్య, హీరో ఉమాపది ఇద్దరిది లవ్ మ్యారేజ్. వీరిద్దరు చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. వీరి పెళ్లికి పెద్దలు సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.

ఐశ్వర్య అర్జున్, ఉమాపతి నిశ్చితార్థ వేడుకలు గతేడాది అక్టోబర్ లో ఘనంగా జరిగాయి. ఉమాపతి తమిళంలో పలు చిత్రాల్లో నటించాడు. మనియార్ కుటుంబం, తిరువనం, థానే వాడి, అడగప్పట్టత్తు మనజనంగళే వంటి చిత్రాల్లో హీరోగా అలరించారు.

ప్రస్తుతం ఐశ్వర్య అర్జున్, ఉమాపతి వివాహ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జాకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.




