దేశముదురు సినిమాను మిస్సైంది.. కట్ చేస్తే.. బన్నీతో బ్లాక్ బస్టర్..
Rajitha Chanti
Pic credit - Instagram
22 April 2026
చిత్ర పరిశ్రమలో ఒక సినిమా విజయం సాధించాలంటే కథనంతో పాటు నటీనటుల ఎంపిక చాలా కీలకం. కొన్నిసార్లు ఒక హీరోయిన్ కోసం అనుకున్న పాత్ర అనుకోకుండా మరొకరి దగ్గరకు వెళ్తుంది.
ఆ సినిమా సూపర్ హిట్ అయితే, ఛాన్స్ మిస్ చేసుకున్న హీరోయిన్ కెరీర్ మలుపు తిరుగుతుంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లోనూ జరిగిందన్న సంగతి తెలుసా.
బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచిన 'దేశముదురు' సినిమా విషయంలో ఆసక్తికర విషయం జరిగింది. ఈ సినిమాలో హాన్సిక మోత్వానీ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.
నిజానికి రకుల్ ప్రీత్ సింగ్ అప్పటికి ఇంకా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టలేదు. ఆమె ఫోటోలు చూసిన పూరీ టీమ్, ఆమెను ఆడిషన్స్ కోసం పిలిచారని.. కొన్ని కారణాల వల్ల ఆ అవకాశం ఆమెకు దక్కలేదు.
నిజానికి రకుల్ ప్రీత్ సింగ్ అప్పటికి ఇంకా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టలేదు. ఆమె ఫోటోలు చూసిన పూరీ టీమ్, ఆమెను ఆడిషన్స్ కోసం పిలిచారని.. కొన్ని కారణాల వల్ల ఆ అవకాశం ఆమెకు దక్కలేదు.
దీంతో రకుల్ అరంగేట్రం కాస్త ఆలస్యమైంది. ఒకవేళ దేశముదురుతోనే ఆమె కెరీర్ మొదలై ఉంటే, టాలీవుడ్ లెక్కలు మరోలా ఉండేవని నెటిజన్లు అభిప్రాయపడుతుంటారు.
దేశముదురు సినిమాలో అవకాశం కోల్పోయిన రకుల్, ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
ఆరంభంలో చిన్న సినిమాలు చేసినా, తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అయితే, తనకు మొదటి అవకాశం ఇవ్వాల్సిన అల్లు అర్జున్‌తో కలిసి నటించే ఛాన్స్ 'సరైనోడు' సినిమాతో దక్కింది.