నేను నోరు తెరిస్తే వాళ్ల కాపురాలు కూలిపోతాయ్..

Rajeev 

23 April 2026

instagram

సింగర్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు గీతామాధురి. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో పాటలు పాడి అలరించారు ఆమె. 

సింగర్ గానే కాదు పలు టీవీ షోలకు అలాగే సింగింగ్ షోలకు జడ్జ్ గా వ్యవహరించి ప్రేక్షకులను మెప్పించారు గీత మాధురి.

తాజాగా గీత మాధురి ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. దాంతో ఇప్పుడు ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

గీతామాధురి మాట్లాడుతూ నేను సాధారణంగా బయటకు వెళ్ళాను వెళ్తే కాఫీ షాప్ కు మాత్రమే వెళ్తాను అని తెలిపింది.

అయితే నేను వెళ్లిన ప్రతిసారి ఎదో ఒక ప్రేమ జంట నా కంటబడతారు. ఇలా చాలా మంది నాకు దొరిపోయారు.

నేను వెళ్లిన ప్రతిసారి ఎవరో ఒకరు ప్రేమ జంట నా కంటికి చిక్కుతునే ఉంటారు అని చెప్పి షాక్ ఇచ్చారు గీత.

నేను నోరు తెరిస్తే వాళ్ళ కాపురాలు కూలిపోతాయి అని ఆమె అన్నారు. దాంతో ఆ ప్రేమ జంటలు ఎవరు అంటూ నెటిజన్స్ ఆలోచించే పనిలో పడ్డారు.