AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చీమలపై దండయాత్ర.. ఇంటి నుంచి వాటిని తరిమికొట్టే సూపర్ చిట్కాలు ఇవే..

పంచదార డబ్బా తెరిస్తే చాలు.. చీమల దండు కనిపిస్తోందా? విషపూరితమైన స్ప్రేలు వాడాలంటే భయమేస్తోందా? అయితే నో టెన్షన్.. మీ వంటగదిలో ఉండే వెనిగర్, దాల్చినచెక్క మీ ఇంటికి రక్షణ కవచాలుగా మారబోతున్నాయి. చీమలను చంపకుండానే మీ ఇంటి నుండి వాటిని ఎలా తరిమి కొట్టవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

చీమలపై దండయాత్ర.. ఇంటి నుంచి వాటిని తరిమికొట్టే సూపర్ చిట్కాలు ఇవే..
How To Get Rid Of Red Ants Naturally
Krishna S
|

Updated on: Apr 23, 2026 | 9:18 PM

Share

వేసవి కాలం రాగానే భానుడి ప్రతాపంతో పాటు మహిళలను వేధించే మరో ప్రధాన సమస్య ఎర్ర చీమలు. ఒక్క పంచదార గిన్నె లేదా రాలిన అన్నం మెతుకు కనిపిస్తే చాలు.. క్షణాల్లో వందలాది చీమలు అక్కడ ప్రత్యక్షమవుతాయి. ఇవి ఆహారాన్ని పాడు చేయడమే కాకుండా కుడితే వచ్చే మంట, దద్దుర్లు చిన్నపిల్లలను మరింత ఇబ్బంది పెడతాయి. వీటిని వదిలించుకోవడానికి మార్కెట్లో దొరికే విషపూరిత రసాయనాలు వాడితే, అవి మన ఆరోగ్యానికి, పెంపుడు జంతువులకు కూడా హానికరమే. అయితే చీమలను చంపకుండానే మీ ఇంటి నుండి పంపించేసే అద్భుతమైన సహజ సిద్ధమైన మార్గాలు మన వంటింట్లోనే ఉన్నాయి..

చీమలు ఒకదాని వెనుక ఒకటి ఎలా వస్తాయి..?

చీమలు కదులుతున్నప్పుడు ఫెరోమోన్లు అనే ఒక రకమైన ప్రత్యేక వాసనను విడుదల చేస్తాయి. వెనుక వచ్చే చీమలు ఆ వాసనను అనుసరిస్తూ దారి కనుక్కుంటాయి. అందుకే మనం ఆ వాసనను తుడిచిపెట్టగలిగితే, చీమలు దారి తప్పి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతాయి.

చీమలను తరిమికొట్టే పవర్ ఫుల్ చిట్కాలు..

వెనిగర్ మ్యాజిక్ :

చీమల ఫెరోమోన్ వాసనను పోగొట్టడంలో వెనిగర్ అద్భుతంగా పనిచేస్తుంది. ఒక స్ప్రే బాటిల్‌లో సగం నీరు, సగం తెల్ల వెనిగర్ కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకోండి. చీమలు ఇంట్లోకి ప్రవేశించే ద్వారాలు, కిటికీలు మరియు అవి తిరిగే మార్గాల్లో దీనిని స్ప్రే చేయండి. ఆ ఘాటైన వాసన ఉన్నంత సేపు చీమలు అటువైపు రావు.

దాల్చినచెక్క సువాసన:

మనకు దాల్చినచెక్క సువాసన ఇష్టమే కానీ చీమలకు అది అణుబాంబు లాంటిది. దాల్చినచెక్క పొడిని చీమల గూళ్ల దగ్గర చల్లండి. ఒకవేళ పొడి చల్లడం ఇబ్బంది అనుకుంటే, దాల్చినచెక్క నూనెలో దూదిని ముంచి, చీమలు వచ్చే రంధ్రాల దగ్గర ఉంచండి. ఆ వాసనకు చీమలు తక్షణమే దారి మళ్లుతాయి.

నిమ్మరసం, తొక్కలు

మీకు వెనిగర్ వాసన నచ్చకపోతే నిమ్మకాయ మంచి ప్రత్యామ్నాయం. ఇందులోని సిట్రిక్ యాసిడ్ చీమలను అయోమయానికి గురిచేస్తుంది. నిమ్మరసాన్ని నేరుగా చీమల ప్రదేశాల్లో చల్లండి లేదా నిమ్మ తొక్కలను చిన్న ముక్కలుగా కోసి వంటగది మూలల్లో వేయండి. తొక్కల్లో ఉండే ‘లిమోనేన్’ అనే పదార్థం చీమలను దూరం ఉంచుతుంది.

మిరియాల పొడి:

చీమలకు పంచదార ఎంత ఇష్టమో, మిరియాల ఘాటు అంటే అంత భయం. చీమలు ఉన్న చోట కొద్దిగా మిరియాల పొడిని చల్లండి. ఇది చీమలను చంపదు కానీ, అవి అక్కడ ఉండకుండా చేస్తుంది.

ముందస్తు జాగ్రత్తలు

వంటగది ప్లాట్‌ఫారమ్‌పై చక్కెర లేదా తినుబండారాలు పడకుండా చూసుకోండి.తడి ఉన్న చోట చీమలు త్వరగా వస్తాయి, కాబట్టి సింక్ దగ్గర ప్రదేశాలను పొడిగా ఉంచండి.

Follow Us