AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మందుబాబులకు అలర్ట్.. మద్యం తాగితే లివర్ ఎలా చెడిపోతుందో తెలుసా..? ఎవ్వరికీ తెలియని నిజాలివే

భారతదేశంలో కాలేయ వ్యాధుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోందని వైద్యులు విశ్లేషణలో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మంది, భారతదేశంలో దాదాపు 7 కోట్ల మంది లివర్ వ్యాధులతో బాధపడుతున్నారు. రోజుకు 500 మంది ఈ వ్యాధులతో మరణిస్తున్నారు. ముఖ్యంగా 40 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్కులలో ఆల్కహాల్ సంబంధిత కాలేయ వ్యాధులు అధికంగా చూస్తున్నామని డాక్టర్లు పేర్కొన్నారు

Phani CH
|

Updated on: Apr 23, 2026 | 9:19 PM

Share
భారతదేశంలో కాలేయ వ్యాధుల పెరుగుదల ఆందోళనకరంగా మారింది.  ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 కోట్ల మంది లివర్ వ్యాధులతో బాధపడుతుండగా, భారతదేశంలో ఈ సంఖ్య సుమారు 7 కోట్లు. ప్రతిరోజూ మన దేశంలో 500 మంది కాలేయ సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ వ్యాధులు ప్రధానంగా 40 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్కులను ప్రభావితం చేస్తున్నాయని, దీనివల్ల కుటుంబానికి ఆధారమైన వ్యక్తులు ఆరోగ్యం కోల్పోతున్నారని వైద్యులు వివరించారు.

1 / 6
కాలేయ వ్యాధులు వయస్సును బట్టి మారుతూ ఉంటాయని వైద్యులు తెలుపుతున్నారు. పుట్టిన పిల్లలలో జన్యుపరమైన వ్యాధులు, వృద్ధులలో (70-80 ఏళ్లు) క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తాయి. అయితే, 40 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్కులలో ఆల్కహాల్, ఫ్యాటీ లివర్ సమస్యలు అధికంగా ఉంటున్నాయి. యువకులలో (10-40 ఏళ్లు) వైరల్ హెపటైటిస్ ఎక్కువగా చూస్తున్నట్లు వెల్లడించారు.

2 / 6
ఆల్కహాల్ సంబంధిత కాలేయ వ్యాధులు చాలావరకు ఆలస్యంగా గుర్తిస్తున్నారు. దీనికి ప్రధాన కారణాలు అవగాహన లేకపోవడం, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం, సరైన వైద్య సలహాలు పాటించకపోవడం. చిన్నతనం నుంచే పాఠశాల విద్య, విశ్వవిద్యాలయ స్థాయిలో ఆరోగ్యం, వ్యాధుల నివారణ వంటి అంశాలపై కరిక్యులమ్‌లో మార్పులు తీసుకురావడం అవశ్యకమని ఆయన నొక్కి చెప్తున్నారు

3 / 6
గత 40-50 ఏళ్లలో ఆల్కహాల్ వినియోగం 10 నుంచి 20 రెట్లు పెరిగిందని, టీనేజర్లు, యూనివర్సిటీ విద్యార్థులలో ఆల్కహాల్ సేవించడం ఒక కూల్ ట్రెండ్‌గా మారుతుందట . ఆల్కహాల్‌ను నియంత్రించే సామర్థ్యం మనకు ఉండాలి, అది మనల్ని నియంత్రించకూడదు అని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. వారానికి ఒకటి లేదా రెండు రోజులు, ఒకటీ రెండు డ్రింక్స్ పరిమిత మోతాదులో తీసుకుంటే కాలేయానికి నష్టం జరగదని ఆయన సూచించారు.

4 / 6
మద్యపాన అలవాటులో రెండు రకాల రోగులుంటారని వైద్యులు వివరిస్తున్నారు. ఒకరు తెలియక ఎక్కువ మోతాదులో తీసుకునేవారు. వీరికి ఆల్కహాల్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించినప్పుడు, చాలామంది తగ్గించుకోవడం లేదా మానేయడం చేస్తారు. ఉదాహరణకు, స్కాచ్ అయినా, స్థానికంగా తయారైనది అయినా, మద్యం బాటిళ్లపై 40% ఆల్కహాల్ ఉంటుందని, అది లివర్‌కు హానికరమని తెలియజేయడం ముఖ్యం.

5 / 6
రెండో రకం రోగులు మద్యానికి బానిసలైన వారు (డిపెండెంట్). వీరికి ఆల్కహాల్ తమ నియంత్రణలో ఉండదు, అది వారిని నియంత్రిస్తుంది. ఈ రకమైన రోగులకు చికిత్స చాలా క్లిష్టంగా ఉంటుంది. వీరికి కుటుంబ సభ్యులను ఎడ్యుకేట్ చేయడంతో పాటు, సోషల్ వర్కర్లు, ఆల్కహాల్ వ్యసనం నుంచి బయటపడిన వారితో మాట్లాడించడం, రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ లో చేర్చడం అవసరం. ఆల్కహాలిక్స్ అనామస్ (AA) వంటి సంస్థలు ఇటువంటి వారికి అండగా ఉంటాయని వైద్యులు తెలుపుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో కూడా ఇటువంటి చిన్న చిన్న గ్రూపులు వైద్యులు వివరించారు. నోట్ .. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం.. ఇది ఇంటర్నెట్ ద్వారా సేకరించిన సమాచారం.. ఏమైనా సందేహాలుంటే వైద్యనిపుణులను సంప్రదించండి..

6 / 6
Follow Us
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..

సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం

అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో

అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..

నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!

నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..

ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్

తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం

ఆధ్యాత్మిక భారతం.. ఏ ఆలయం చూసినా కిక్కిరిపోతున్న భక్తజనం..

చాణక్యుడు చెప్పిన గోల్డెన్ రూల్స్: విద్యార్థుల విజయానికి అసలు ..