AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. వరంగల్ నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా..

డిమాండ్ల సాధన కోసం పోరుబాట పట్టిన ఆర్టీసీ కార్మికులు.. ప్రాణాలు తీసుకొనేందుకూ వెనుకాడట్లేదు నర్సంపేట బస్‌ డిపోలో డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకోవడం కలకలం రేపింది. MGMలో చికిత్స అనంతరం.. మెరుగైన చికిత్స కోసం శంకర్‌గౌడ్‌ను హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో ఆయన మరణించారు.

Telangana: నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. వరంగల్ నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా..
Rtc Driver Shankar Goud Passes Away
Krishna S
|

Updated on: Apr 23, 2026 | 10:28 PM

Share

రెండ్రోజులకే ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాల్చింది. డిమాండ్ల సాధన కోసం పోరుబాట పట్టిన కార్మికులు… ప్రాణాలు తీసుకొనేందుకూ వెనుకాడట్లేదు. నర్సంపేట బస్‌ డిపోలో డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకోవడం కలకలం రేపింది. ఎంజీఎంలో చికిత్స అనంతరం.. మెరుగైన చికిత్స కోసం శంకర్‌గౌడ్‌ను హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. ప్రస్తుతం కంచన్‌బాగ్ డీఆర్డీవో అపోలో ఆస్పత్రిలో ఆయన మృతదేహాన్ని ఉంచారు. అంతకుముందు ఎంజీఎం ఆస్పత్రి వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కార్మిక సంఘాల నేతలు, బీఆర్ఎస్ నాయకులు తరలిరావడంతో ఉద్రిక్తతకు దారితీసింది. స్వయంగా కలెక్టర్‌, సీపీ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా ఆయన మరణించారు.

మరో ఇద్దరు

అటు మిర్యాలగూడలో వెంకన్న అనే డ్రైవర్‌ ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్నారు. భద్రాచలంలో డ్రైవర్‌ లింగారెడ్డి.. గడ్డిమందు తాగడం మరింత కలకలం రేపింది. మంత్రి పొన్నం అబద్ధపు ప్రకటనల వల్లే కార్మికుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆర్టీసీ జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వరుసగా ఈనెల 29వరకు మౌన ప్రదర్శన, వంటా వార్పు, అర్ధ నగ్న ప్రదర్శనల వంటి నిరసనలకు పిలుపునిచ్చింది.

సమ్మెపై స్పందించిన రేవంత్

మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కార్మికులు ప్రాణాలు తీసుకోవడం సమస్యలకు పరిష్కారం.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని రిక్వెస్ట్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులు సంయమనం పాటించి సమ్మె విరమించాలని మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. చర్చలకు సిద్ధంగా ఉన్నామన్న మంత్రి.. సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు. కాగా డిప్యూటీ సీఎం భట్టి ఆధ్వర్యంలో మంత్రులు శుక్రవారం కార్మిక సంఘాలతో చర్చలు జరపనున్నారు.

Follow Us
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
ఆధ్యాత్మిక భారతం.. ఏ ఆలయం చూసినా కిక్కిరిపోతున్న భక్తజనం..
ఆధ్యాత్మిక భారతం.. ఏ ఆలయం చూసినా కిక్కిరిపోతున్న భక్తజనం..
చాణక్యుడు చెప్పిన గోల్డెన్ రూల్స్: విద్యార్థుల విజయానికి అసలు ..
చాణక్యుడు చెప్పిన గోల్డెన్ రూల్స్: విద్యార్థుల విజయానికి అసలు ..