నిజంగా భక్తా.. ‘స్టేటస్’ కోసమా?.. అయోధ్య నుంచి అరుణాచలం వరకు.. ఏ ఆలయం చూసినా అదే హోరు!
ఇది డిజిటల్ యుగం. యాత్రా దర్శనాల పేరుతో ఎంతమంది వ్లాగర్స్ ఉన్నారో లెక్కే లేదు. ఫలానా పుణ్యక్షేత్రం గురించి అడగడం ఆలస్యం అ నుంచి అంఅః వరకు మొత్తం డిటైల్స్ అందులో పెడుతున్నారు. పాజిటివ్స్ నెగిటివ్స్, అనుకూలతలు, ప్రతికూలతలు అన్నీ తెలుస్తున్నాయి.

ఓ ఇంట్రస్టింగ్ డేటా చెప్పుకుందాం.. ఫెడరేషన్ ఆఫ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆమధ్య బెంగళూరులో ఓ మీటింగ్ పెట్టింది. 2047 నాటికి భారత్‌లో టూరిజం ఎలా ఉండబోతోంది, ఎలాంటి స్ట్రాటజీలు అవసరం అనే దానిపై. వందలమంది డెలిగేట్స్ వెళ్లారు ఆ మీటింగ్‌కి. ప్రెస్టీజియన్ హోటల్స్ రిప్రజెంటీవ్స్, పాలసీ మేకర్స్, ట్రావెల్ ఏజెంట్స్, టూరిజం ఫెసిలిటేటర్స్.. ఇలా ఎంతోమంది అటెండ్ అయ్యారు. Agoda తెలుసుగా.. ఆ సంస్థ ఓ ప్రశ్న వేసింది. ‘ఇంతకీ.. ఏ టూరిస్ట్ స్పాట్ గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు ఈ టూరిస్టులు’ అని అడిగింది. గోవా, ఊటీ, కులు-మనాలి, జమ్మూకశ్మీర్.. ఇవేవీ కావట. తిరుపతి ఫస్ట్ ప్లేస్‌లో ఉందిట. ఇంట్రస్టింగ్ కదా. ఆధ్యాత్మికమే పర్యాటకం. దైవచింతన కోసం వెళ్లడమే టూరిజం మనదగ్గర. జనాల్లో భక్తి పెరిగిందనడానికి ఇంతకు మించిన ప్రూఫ్ ఏం కావాలి..! బట్.. ఈ భక్తి మనిషిని ఎటువైపు తీసుకెళ్తోంది. సన్మార్గానికా, ఉన్నమార్గంలోనే ఉండడానికా? చార్‌ధామ్ యాత్ర. అత్యంత కఠినమైంది. ఒకనాడు ‘కాశికి వెళ్లినవాడు కాటికి వెళ్లినవాడు ఒకటే’ అనే సామెత ఉండేది. కాశీ మీద చెప్పలేని మమకారమో.. ఏ వాసనా విశేషమో.. తిరిగి స్వస్థలానికి వచ్చివేయాలి అనే ఆలోచన అక్కడి గాలి సోకిన వాడికి కలగదు అని ఒక అర్థం. కాశీ లాంటి దూర ప్రయాణాలు చెయ్యడమే సాహసం అనేది మరో అర్థం. పూర్వం.. కాశీ ప్రయాణం ఆల్‌మోస్ట్ మరణంతో సమానం. కాశీయాత్రనే సాహసం, వ్యయప్రయాస అంటుంటే.....
