చీమలను తరిమికొట్టే సీక్రెట్స్.. సింపుల్‌గా ఇలా చేస్తే మళ్లీ రావు..
Krishna
04 June 2026
చీమలను తరిమికొట్టడానికి వెనిగర్ అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది. ఒక ఖాళీ స్ప్రే బాటిల్‌లో వెనిగర్, నీటిని కలపండి. ఇంట్లో చీమలు తిరిగే ప్రదేశాల్లో దీనిని స్ప్రే చేస్తే.. ఆ ఘాటైన వాసనకు చీమలు రావు.
వెనిగర్ స్ప్రే
చీమలను వదిలించుకోవడానికి సుద్దను ఉపయోగించడం కూడా ఒక ఈజీ మార్గం. చీమల బెడద ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో లేదా అవి వచ్చే దారుల్లో సుద్ద పొడిని చల్లండి. సుద్దలో ఉండే కాల్షియం కార్బోనేట్ చీమలకు పడదు.
సుద్ద పొడి
చీమలు వచ్చే చోట్ల కొద్దిగా నిమ్మరసం పోయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ వాసనకు చీమలు పారిపోతాయి. నిమ్మరసంతో పాటు చీమలు ఎక్కువగా తిరిగే మూలల్లో నిమ్మ తొక్కలను ఉంచడం బెటర్.
నిమ్మరసం
వంటింట్లో చీమలను తరిమికొట్టడానికి మీరు వెల్లుల్లిని బాగా పనిచేస్తుంది. వెల్లుల్లి నుంచి వచ్చే పచ్చి వాసన చీమలకు అస్సలు భరించరానిది. కొన్ని వెల్లుల్లి రెబ్బలను దంచి చీమలు వచ్చే చోట పెడితే ఆ దరిదాపుల్లోకి మళ్లీ రావు.
వెల్లుల్లి రెబ్బలు
నీటిలో ఉప్పు వేసి బాగా మరిగించండి. ఈ వేడి ఉప్పు నీటిని ఒక బాటిల్‌లో పోసి చీమలు గూళ్లు కట్టుకున్న ప్రదేశాలపై లేదా గోడల సందుల్లో చల్లండి. ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడిన సులువైన చిట్కా.
వేడి ఉప్పు నీరు
చీమలను వదిలించుకోవడానికి నారింజ తొక్కలు కూడా అద్భుతంగా సహాయపడతాయి. నారింజ తొక్కలను కొన్ని గోరువెచ్చని నీటితో కలిపి మిక్సీలో రుబ్బి ఒక ముద్దలా చేయండి. ఈ ముద్దను చీమలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో ఉంచండి.
నారింజ ముద్ద
మీకు ఇంట్లో ఎక్కడైనా చీమల లైన్లు కనిపిస్తే.. ఆ ప్రదేశాలలో కొద్దిగా మిరియాల పొడిని చల్లడం మంచిది. మిరియాలలోని ఘాటు గుణం వల్ల చీమలు మీ ఇంటికి రాకుండా శాశ్వతంగా నిరోధించవచ్చు.
మిరియాల పొడి
చీమలకు తీపి వస్తువుల వాసన ఎంత ఇష్టమో.. లవంగాల ఘాటు వాసన అంత శత్రువు. పంచదార డబ్బాలో లేదా తీపి పదార్థాలు పెట్టే చోట నాలుగు లవంగాలను వేసి ఉంచితే.. ఆ వాసనకు చీమలు ఆ డబ్బాల వైపు కన్నెత్తి కూడా చూడవు.