ఇన్ స్టాలో ఫాలోవర్స్ లేరని సినిమా నుంచి తీసేశారు.. ఈ హీరోయిన్ కష్టాలు
Rajitha Chanti
Pic credit - Instagram
22 April 2026
టాలీవుడ్ సీనియర్ హీరో యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ కుమార్తెగా 'దొరసాని' చిత్రంతో వెండితెరకు పరిచయమైన శివాత్మిక రాజశేఖర్, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.
కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటుంది. తాజాగా ఆమె పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకుంది.
స్టార్ కిడ్స్‌పై అంచనాలు ఎప్పుడూ ఎక్కువగా ఉంటాయని శివాత్మిక అభిప్రాయపడింది. "రాజశేఖర్ గారి అమ్మాయి అనగానే ప్రేక్షకులు నా నుండి ఒక రకమైన నటనను ఆశిస్తారని తెలిపింది.
ఆ వారసత్వాన్ని మోయడం ఒక గౌరవంగా భావిస్తాను, కానీ అది ఒక బాధ్యత కూడా. నాన్న సంపాదించుకున్న పేరుకు ఎక్కడా భంగం కలగకూడదనేది నా ప్రధాన ఉద్దేశ్యం అని అన్నారు.
తనకు ఇన్ స్టాలో సరైన ఫాలోవర్స్ లేకపోవడంతో కొన్ని సినిమాల నుంచి హీరోయిన్‌గా తీసేశారని, మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న కొందరికి అవకాశమిచ్చారని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.
ప్రస్తుతం ఏ మేనేజర్ లేదా ఏజెంట్‌ని కలిసినా సరే ఇన్ స్టాలో ఫాలోవర్స్‌ని పెంచుకోమంటున్నారని చెప్పుకొచ్చింది. అయితే తాను ఓ యాక్టర్ అని కంటెంట్ క్రియేట్ చేయడం తన పనికాదని తెలిపింది.
సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు లేదా ట్రోల్స్ గురించి మాట్లాడుతూ.. తను వాటిని పెద్దగా పట్టించుకోనని, కేవలం నిర్మాణాత్మకమైన విమర్శలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటానని చెప్పింది.
నటిగా ఎదగాలంటే నిరంతరం నేర్చుకుంటూ ఉండాలని, తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు సాగడమే తన నైజమని వివరించింది. ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులతో బిజీగా ఉంది.