- Telugu News Photo Gallery Cinema photos Tollywood heroes jr ntr ram charan pawan kalyan and chiranjeevi 2024 movie shooting updates
రెస్ట్ మోడ్ నుంచి బయటకు వచ్చిన స్టార్ హీరోలు.. శరవేగంగా షూటింగ్స్..
కొన్ని రోజులుగా రెస్ట్ మోడ్‌లో ఉన్న మెగా హీరోలు మళ్లీ సెట్స్‌కు వచ్చారు.. అలాగే బాలయ్య కూడా నేడో రేపో వచ్చేస్తున్నారు.. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా షూటింగ్ కోసం సిద్ధమవుతున్నారు.. మహేష్ బాబు మాత్రం ఇంకా కొన్నాళ్ల పాటు రెస్ట్‌లోనే ఉండబోతున్నారు. ఇలా ఒక్కొక్కరి గురించి కాకుండా.. ఎవరెక్కడున్నారో.. ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతుందో చూద్దాం పదండి.. చాలా రోజుల తర్వాత ప్రభాస్ కాస్త రిలాక్స్ అవుతున్నారు. ఈయన నటిస్తున్న కల్కి పొస్ట్ ప్రొడక్షన్‌లో బిజీగా ఉంది. మరోవైపు రాజా సాబ్‌కు చిన్న బ్రేక్ ఇచ్చారు.
Updated on: Jun 12, 2024 | 8:24 AM

కొన్ని రోజులుగా రెస్ట్ మోడ్‌లో ఉన్న మెగా హీరోలు మళ్లీ సెట్స్‌కు వచ్చారు.. అలాగే బాలయ్య కూడా నేడో రేపో వచ్చేస్తున్నారు.. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా షూటింగ్ కోసం సిద్ధమవుతున్నారు.. మహేష్ బాబు మాత్రం ఇంకా కొన్నాళ్ల పాటు రెస్ట్‌లోనే ఉండబోతున్నారు. ఇలా ఒక్కొక్కరి గురించి కాకుండా.. ఎవరెక్కడున్నారో.. ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతుందో చూద్దాం పదండి..

చాలా రోజుల తర్వాత ప్రభాస్ కాస్త రిలాక్స్ అవుతున్నారు. ఈయన నటిస్తున్న కల్కి పొస్ట్ ప్రొడక్షన్‌లో బిజీగా ఉంది. మరోవైపు రాజా సాబ్‌కు చిన్న బ్రేక్ ఇచ్చారు.

ఇక జూనియర్ ఎన్టీఆర్ దేవర షూటింగ్ గోవాలో జరుగుతుంది. అక్కడే కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు కొరటాల. అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ రెండు వారాలుగా ప్రగతి రిసార్ట్స్‌లోనే జరుగుతుంది.

చిన్న బ్రేక్ తర్వాత గేమ్ ఛేంజర్ కొత్త షెడ్యూల్ మొదలైంది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చివరి షెడ్యూల్ చిత్రీకరిస్తున్నారు శంకర్. ఇక విశ్వంభర షూటింగ్ జూన్ 12 నుంచి అన్నపూర్ణ 7 ఎకర్స్‌లో జరగనుంది. 13న చిరు జాయిన్ కానున్నారు. నాని సరిపోదా శనివారం, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ షూటింగ్స్ అల్యూమీనియం ఫ్యాక్టరీలో జరుగుతున్నాయి.

శర్వానంద్, అభిలాష్ కంకర సినిమా షూటింగ్ 4 వారాలుగా శంషాబాద్‌లోనే జరుగుతుంది. గోపీచంద్, శ్రీను వైట్ల విశ్వం షూట్ మేడ్చల్‌లో జరుగుతుండగా.. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమా షూట్ వైజాగ్‌లో 3 వారాలుగా జరుగుతుంది. ధనుష్ కుబేరా సారధి స్టూడియోస్‌లో.. సూర్య కంగువా షూటింగ్ పఠాన్ చెరు పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది.




