Cinema : ఏం సినిమా రా అయ్యా.. సీన్ సీన్‌కు మెంటలెక్కిపోద్ది.. బాక్సాఫీస్ షేక్ చేసిన రొమాంటిక్ లవ్ స్టోరీ..
2025లో అత్యంత ప్రజాదరణ పొందిన సినిమా ఇది. ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కొన్ని సినిమాలు మాత్రం అద్భుతాలు చేయగలిగాయి. అందులో ఇది ఒకటి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై వందల కోట్ల కలెక్షన్స్ రాబట్టి సత్తా చాటింది. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న మూవీ ఏంటో తెలుసా..

2025 సంవత్సరంలో ఎన్నో సినిమాలు అడియన్స్ ముందుకు వచ్చాయి. స్టార్ హీరోహీరోయిన్స్, భారీ బడ్జెట్ సినిమాలో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేశాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా మాత్రం పెద్ద స్టార్లను కూడా ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాలో పెద్ద హీరో లేదా టాప్ హీరోయిన్ లేరు. ఆ సినిమా దాని అద్భుతమైన కథ ఆధారంగానే బ్లాక్ బస్టర్ అయింది. ఆ సినిమా పేరు ‘సైయారా’. బాలీవుడ్ స్టార్ హీరో మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఇందులో యంగ్ హీరోహీరోయిన్ అహన్ పాండే, అనిత్ పద్దా ప్రధాన పాత్రల్లో నటించారు. రాజేష్ కుమార్, గీతా అగర్వాల్, వరుణ్ బడోలా, షాద్ రంధవా వంటి తారలు కీలకపాత్రలు పోషించారు.
ఇవి కూడా చదవండి : OTT Movies: ఏం సినిమా గురూ ఇది.. కోర్టులో ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో ఈ మూవీస్ చూస్తే..
ఈ సినిమా సింగర్ క్రిష్ కపూర్ (అహాన్ పాండే), రచయిత వాణి బాత్రా (అనిత్ పడ్డా) ఈ రెండు పాత్రల చుట్టూ తిరుగుతుంది. క్రిష్ పాటలు కంపోజ్ చేసే టాలెంట్ ఉంటుంది. ఇక వాణి అద్భుతమైన రచయిత్ర.ఇద్దరి పరిచయం వారి జీవితాల్లో మార్పులు వస్తాయి. ఈ సినిమాలోని పాటలు ప్రధాన హైలెట్. ఇద్దరూ ప్రేమలో సంతోషంగా ఉండగానే తమ జీవితాల్లో కొత్త మలుపు తిరుగుతాయి. అప్పుడు కథలో ఒక మలుపు వస్తుంది, అది ప్రేక్షకులను చాలా భావోద్వేగానికి గురి చేస్తుంది.
ఇవి కూడా చదవండి : Nayanthara : ఆ సినిమా చేయడం జీవితంలోనే చెత్త నిర్ణయం.. నయనతార సంచలన కామెంట్స్..
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. కేవలం రిలీజ్ అయిన 40 రోజుల్లోనే భారతదేశంలో రూ.328.20 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.561.50 కోట్లు రాబట్టింది. ఈ సినిమాను దాదాపు రూ.45 కోట్లతో నిర్మించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 1144 శాతం లాభాన్ని రాబట్టింది. ఇదిలా ఉంటే.. ఈ మూవీ సెప్టెంబర్ నెలలో ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుందని సమాచారం.
ఇవి కూడా చదవండి : Cinema : ఓటీటీలో అదరగొడుతున్న కామెడీ థ్రిల్లర్.. 2 గంటలు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్..
ఇవి కూడా చదవండి : Tollywood: ఎంగేజ్మెంట్ క్యాన్సిల్.. హీరోలతో ఎఫైర్ రూమర్స్.. 42 ఏళ్ల వయసులో దుమ్మురేపుతోన్న హీరోయిన్..







