AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఒకప్పుడు సినిమాల్లో రారాజు… పక్షవాతంతో ఇండస్ట్రీకి దూరం.. ఇప్పుడు విలన్‏గా.. 3300 కోట్లకు..

ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకుని కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న హీరో అతడు. లవ్ స్టోరీ చిత్రాలతో సినీరంగంలో తనదైన ముద్ర వేశాడు. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యారు. ఆ సమయంలోనే వ్యాపారరంగంలో తిరుగులేని సత్తా చాటారు.

Tollywood : ఒకప్పుడు సినిమాల్లో రారాజు... పక్షవాతంతో ఇండస్ట్రీకి దూరం.. ఇప్పుడు విలన్‏గా.. 3300 కోట్లకు..
Aravind Swamy
Rajitha Chanti
|

Updated on: Sep 17, 2025 | 3:50 PM

Share

సినీరంగంలో తక్కువ సమయంలోనే తనదైన ముద్ర వేశారు. మొదట్లో చిన్న చిన్న పాత్రలు పోషించి ఆ తర్వాత హీరోగా మారారు. డైరెక్టర్ మణిరత్నం సినిమాతో తెరంగేట్రం చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. తమిళ చిత్రపరిశ్రమలో హీరోగా తనదైన ముద్ర వేశారు. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఓ ప్రమాదం ఆయన జీవితాన్ని తలకిందులు చేసింది. ఆ ప్రమాదంలో మంచానికే పరిమితమయ్యాడు. పక్షవాతంతో సినిమాలకు పూర్తిగా దూరమయ్యాడు. ఆ సమయంలోనే వ్యాపారరంగంపై దృష్టి పెట్టి సొంతంగా ఓ కంపెనీ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఆ కంపెనీ విలువ రూ.3300 కోట్లకు పైగానే ఉంటుంది. ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఆ హీరో ఇటు విలన్ గా.. అటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ? ఆయన పేరు అరవింద్ స్వామి.

ఇవి కూడా చదవండి : Actress: అప్పుడు స్కూల్లో టీచర్.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?

ఇవి కూడా చదవండి

అరవింద్ స్వామి దక్షిణాది సినీప్రియులకు పరిచయం అక్కర్లేదు. 1991లో డైరెక్టర్ మణిరత్నం, రజినీకాంత్ కాంబోలో వచ్చిన దళపతి చిత్రంలో చిన్న పాత్రలో కనిపించారు. అప్పుడు ఆయన వయసు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించారు. అందులో తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత డైరెక్టర్ మణిరత్నం అరవింద్ స్వామిని హీరోగా పెట్టి రోజా చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఆ తర్వాత వచ్చిన బొంబాయి చిత్రం సైతం సూపర్ హిట్ అయ్యింది.

ఇవి కూడా చదవండి : Cinema: కాంతార, కేజీఎఫ్ చిత్రాలను వెనక్కు నెట్టింది.. అప్పుడు థియేటర్లు.. ఇప్పుడు ఓటీటీని ఊపేస్తోన్న మూవీ..

2005లో అరవింద్ స్వామి ఓ ప్రమాదానికి గురయ్యారు. ఆ ప్రమాదంలో ఆయన కాలు పక్షవాతానికి గురైంది. దీంతో రెండేళ్ళపాటు మంచానికే పరిమితమయ్యారు. దీంతో సినిమాలకు దూరంగా ఉండిపోయారు. టాలెంట్ మాక్సిమమ్ అనే కంపెనీ స్థాపించారు. ప్రస్తుతం ఆ కంపెనీ విలువ రూ.3300 కోట్లు. చాలా కాలం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. రామ్ చరణ్ నటించిన ధృవ చిత్రంలో ఆయన విలన్ పాత్రలో అదరగొట్టారు. ఇటీవల సత్యం సుందరం సినిమాతో కట్టిపడేశారు.

ఇవి కూడా చదవండి : Tollywood : 19 ఏళ్ల వయసులో 31 ఏళ్ల స్టార్ హీరోతో పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..

అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..