Tollywood: ఈ బావమరదలు ఇప్పుడు మోస్ట్ బ్యూటీఫుల్ స్టార్ కపుల్.. అతను సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరో..
ఫోటోలో కనిపిస్తోన్న ఆ బావమరదలు సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటీఫుల్ స్టార్ కపుల్. చిన్న బాబును ఎత్తుకున్న పిల్లాడు తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే సినీపరిశ్రమలోకి అడుగుపెట్టి ఇప్పుడు తనకంటూ ప్రత్యేకంగా ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. కేవలం హీరోగానే కాకుండా.. సింగర్, లిరిసిస్ట్‌గానూ రాణిస్తున్నారు. ఇక ఆ కుర్రాడి వెనక కూర్చున్న అమ్మాయి అతని భార్య.

పైన ఫోటోలో కనిపిస్తోన్న ఆ బావమరదలు సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటీఫుల్ స్టార్ కపుల్. చిన్న బాబును ఎత్తుకున్న పిల్లాడు తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే సినీపరిశ్రమలోకి అడుగుపెట్టి ఇప్పుడు తనకంటూ ప్రత్యేకంగా ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. కేవలం హీరోగానే కాకుండా.. సింగర్, లిరిసిస్ట్‌గానూ రాణిస్తున్నారు. ఇక ఆ కుర్రాడి వెనక కూర్చున్న అమ్మాయి అతని భార్య. వీరికి ఓ పాప, బాబు ఉన్నారు. ఎవరో గుర్తుపట్టారా ?… వారే తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్ దంపతులు. ముందు కూర్చున్న అబ్బాయి శివకార్తికేయన్ కాగా.. వెనక కనిపిస్తోన్న అమ్మాయి అతని భార్య ఆర్తి. ఈ దంపతులకు అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. శివ కార్తికేయన్ తన మరదలు ఆర్తిని 2010 ఆగస్ట్ 27న వివాహం చేసుకున్నారు. తాజాగా వీరిద్దరికి సంబంధించిన చిన్ననాటి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.
మిమిక్రీ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేశారు శివకార్తికేయన్. అప్పట్లో సూపర్ స్టార్ రజినీకాంత్ వాయిస్ పర్ఫె్క్ట్ గా దించేసేవాడు. ఆ తర్వాత యాంకర్‌గా మారాడు. స్నేహితుల సలహాతో కొన్ని షార్ట్స్ ఫిలింస్ చేసిన శివకార్తికేయన్ .. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మొదటగా ఏగన్ సినిమాలో చిన్న పాత్రలో నటించారు. కానీ ఎడిటింగ్ లో అతని పాత్ర కట్ అయ్యింది. ఆ తర్వాత డైరెక్టర్ పాండిరాజ్ దర్శకత్వం వహించిన మెరీనా మూవీతో హీరోగా తెరంగేట్రం చేశారు. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడమే కాకుండా శివకార్తికేయన్ కు క్రేజ్ వచ్చింది.




ఇక ఆ తర్వాత శివ కార్తికేయన్ కు ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వచ్చాయి. ఓవైపు హీరోగా నటిస్తూనే.. హోస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్, ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఇక శివకార్తికేయన్ మాత్రమే కాదు.. ఆయన కూతురు ఆరాధన సైతం చిన్నప్పుడే గాయనిగా శభాష్ అనిపించుకుంది. కైసల్య కృష్ణమూర్తి సినిమాలో కూతురితో కలిసి శివ ఓ సాంగ్ పాడారు. అప్పట్లో ఈ పాట సెన్సెషన్ అయ్యింది. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో నటించిన మావీరన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో మహావీరుడు పేరుతో జూలై 14న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.